Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ చేష్టల వెనుక అన్ని లెక్కలు ఉన్నాయా విష్ణు?
By: Tupaki Desk | 10 Oct 2021 4:33 AM GMTరాజకీయం కోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఎవరికి మంచిది కాదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ రోజు జరగనున్న సంగతి తెలిసిందే. కేవలం వెయ్యి కంటే తక్కువ ఓట్లు ఉండే ఈ ఎన్నికల్లో విజయంకోసం గడిచిన కొద్ది రోజులుగా సాగుతున్న రచ్చ తెలసిందే. గెలుపే ప్రధానాంశంగా మంచు విష్ణు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. 'మా' ఎన్నికల్ని మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం విష్ణుదేనని చెప్పాలి. విమర్శలు చేసే విషయంలో.. విరుచుకుపడే విషయంలోనూ వెనుకా ముందు చూసుకోకుండా దూకుడుగా వ్యవహరించిన ఆయన తీరుపై సానుకూలంగా స్పందించే వారే కాదు.. తీవ్రంగా తప్పు పట్టే వారు కూడా లేకపోలేదు.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు కొన్ని గంటల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు.. ఎన్నికల కోసం ఇన్నేసి మాటలు అవసరమా? అన్న భావన కలుగక మానదు. తన ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇస్తున్న నాగబాబుపై ఆయన కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. అభిమానులతో నాగబాబు అంకుల్ ఏం చేయిస్తారో తనకు తెలుసన్నారు.
వ్యక్తిగతంగా తన ఫ్యామిలీని విమర్శిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేసిన విష్ణు... అభ్యర్థిగా ఉన్న తనను విమర్శించొచ్చు కానీ.. కుటుంబాల జోలికి వెళ్లొద్దని విమర్శించారు. నాగబాబు అంకుల్ కు వరుణ్ తేజ్ ఎంతో తాను అంతేనని వ్యాఖ్యానించిన విష్ణు.. మాట విషయానికి వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అందరం ఒకే ఫ్యామిలీ అన్న విషయాన్ని మర్చిపోకూడదన్న నీతులు చెబుతూనే.. అందుకు ఏ మాత్రం సరిపోని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వచ్చాయి.
మిమ్మల్ని ఎమైనా అంటే.. మీ అభిమానులతో మీరేం చేయిస్తారోకూడా తెలుసన్న విష్ణు.. రాజశేఖర్ - జీవిత కార్లపై అభిమానులతో ఎలా దాడిచేయించారో తెలియదనుకుంటున్నారా? అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు లేని వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తాయన్న విషయాన్ని విష్ణు మర్చిపోయారు. గతంలో జరిగిన ఈ దాడి నిజంగానే మెగా ఫ్యామిలీ చేయించి ఉంటే.. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ సర్కారు ఊరుకునేదా? ఒకవేళ.. అందులో ఈసమంత నిజం ఉన్నా.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితో పాత రికార్డుల్నివిష్ణు తీసుకొచ్చే వారు కదా? అవన్నీ వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడి.. తప్పుడు భావన కలిగేలా వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్నగా వినిపిస్తోంది.
విష్ణు చెప్పినట్లు.. పోటీ చేస్తున్న తన మీద విమర్శలు చేయాలి కానీ తన కటుుంబం మీద విమర్శలు వద్దన్న ఆయన.. తన మాటలతో చేస్తున్నదేమిటి? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఒకవేళ.. నిజంగానే మెగా ఫ్యామిలీ తన ఫ్యాన్స్ చేత దాడి చేయంచటమే నిజమైతే.. మరి.. మంచు వారి అభిమానులతో ఇంకేం పనులు చేయిస్తారో అన్న విషయం మీదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నాలుగు రోజుల హడావుడికి కారణమయ్యే 'మా' ఎన్నికల కోసం ఎంతకూ తరగని గ్యాప్ తీసుకొచ్చే వ్యాఖ్యలు విష్ణు నోటి నుంచి రాకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.