Begin typing your search above and press return to search.
కన్నప్ప.. విష్ణు మార్కెట్ కు మూడు రెట్లు
By: Tupaki Desk | 14 April 2016 7:30 AM GMTఓ పక్క ప్రభాస్ హీరోగా తాను ‘భక్త కన్నప్ప’ సినిమా చేసి తీరుతానని మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నాడు రెబల్ స్టార్ కృష్ణం రాజు. ఐతే మంచు ఫ్యామిలీ సైతం కన్నప్ప కథతో సినిమా తీసే విషయంలో ఏం వెనక్కి తగ్గేలా లేదు. ఇంతకుముందు అన్నట్లే తనికెళ్ల భరణి దర్శకత్వంలో తాను ‘కన్నప్ప’ సినిమా చేయబోతున్నట్లు మంచు విష్ణు మరోసారి స్పష్టం చేశాడు. తన తర్వాతి సినిమా ఇదే అని కూడా వెల్లడించాడు విష్ణు.
తనికెళ్ల భరణి అద్భుతమైన స్క్రిప్టు తయారు చేశాడని.. తన మార్కెట్ కు మూడు రెట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా చేయబోతున్నామని విష్ణు చెప్పడం విశేషం. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్ల సాయం తీసుకోబోతున్నట్లు కూడా విష్ణు వెల్లడించాడు. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ చిత్రం తెరకెక్కుతుందన్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అతను చెప్పాడు.
ఐతే ఈ మధ్య కృష్ణంరాజు సైతం ‘భక్త కన్నప్ప’ను తప్పకుండా సెట్స్ మీదికి తీసుకెళ్తానని అన్నాడు. ఈ కథను ఎవరు చేసినా.. ప్రభాస్ చేస్తే దాని రేంజే వేరుగా ఉంటుందని కూడా కృష్ణం రాజు అన్న సంగతి గుర్తుండే ఉంటుంది. తన దగ్గర స్క్రిప్టు కూడా స్టోరీ బోర్డుతో సహా సిద్ధంగా ఉందని అన్నారు కృష్ణం రాజు. మరి మంచు ఫ్యామిలీ ‘కన్నప్ప’ను మొదలుపెట్టేస్తే కృష్ణంరాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక చారిత్రక కథ కోసం ఈ రోజుల్లో ఇంత పోటీ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.