Begin typing your search above and press return to search.
ఈ పాజిటివిటీ అంతా అప్పుడు ఏమైంది విష్ణూ..?
By: Tupaki Desk | 8 April 2022 5:30 PM GMTటాలీవుడ్ లో మెగా - మంచు ఫ్యామిలీల మధ్య అనుబంధం గురించి ఎవరూ సరిగా అర్థం చేసుకోలేరు. వారు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం. ఎన్నో సినిమాలలో కలిసి నటించిన చిరంజీవి - మోహన్ బాబు మధ్య అప్పట్లో కొన్ని పొరపచ్చాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ - నాగబాబు వంటి వారు కూడా మోహన్ బాబుపై కౌంటర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి.
అయితే అవన్నీ టీ కప్పులో తుఫానులా మర్చిపోయి చిరు - మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆదరాభిమానాలు చూపించున్నారు. అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో 'మా' ఎన్నికల వల్ల మళ్లీ వారి మధ్య దూరం పెరిగిందనే కామెంట్స్ వచ్చాయి.
'మా' ఎన్నికలలో మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ గెలవాలని మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే ప్రయత్నాలు చేసారు.ఆ టైంలో మంచు విష్ణుపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.
మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో మెగా వెర్సెస్ మంచు అనే విధంగా పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఏపీలో టికెట్ రేట్ల పరిష్కారం దగ్గర నుంచి 'సన్నాఫ్ ఇండియా' సినిమా డిజాస్టర్ అవడం వరకు జరిగిన పరిణామాలన్నీ అలానే కనిపించాయి. అయితే ఇప్పుడు మెగా హీరో సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మంచు విష్ణు ట్వీట్ చేయడంపై నెగెటివ్ కామెంట్స్ రావడం చర్చనీయాంశంగా మారింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''గని'' మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ''నా సోదరుడు వరుణ్ తేజ్ కి శుభాకాంక్షలు. మీరు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు. అయితే ఈ విషెస్ ను మెగా ఫ్యాన్స్ నెగెటివ్ కోణంలో చూశారు.
'మనసులో సినిమా పోవాలని గట్టిగా కోరుకున్నావ్ కదా?' అని మంచు విష్ణు ట్వీట్ కింద కామెంట్ పెట్టాడు. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా విష్ణు కోరుకోలేదనేది వారి ఆరోపణ. దీనికి రీట్వీట్లు - లైక్స్ కూడా వచ్చాయి. అయితే దీనిపై 'మా' అధ్యక్షుడు అదే స్థాయిలో స్పందించారు. 'నెగెటివిటీ ఎందుకు బ్రదర్.. పాజిటివ్ వైబ్స్ ని మాత్రమే వ్యాప్తి చేయండి' అని సూచించారు.
ఆయితే మెగా అభిమానులు అక్కడితో ఆగలేదు. మరి ఈ పాజిటివిటీ అంతా 'మా' ఎలక్షన్స్ టైం లో ఏమైంది బ్రో అని ప్రశ్నించారు. సీఎం జగన్ తో భేటీ తర్వాత ప్రెస్ మీట్ లో ప్రత్యర్ధులను చిత్తు చిత్తుగా ఓడించానని కామెంట్స్ చేసినప్పుడు పాజిటివిటీ ఏమైందని కౌంటర్లు వేశారు. మీ తమ్ముడు లేటెస్ట్ గా హయ్యర్ పర్పస్ అంటూ కామెంట్స్ చేసినప్పుడు గుర్తు రాలేదా అంటూ మంచు విష్ణు ను నిలదీశారు.