Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్ లో మ‌ళ్లీ ఆట షురూ.. మంచు విష్ణు డాన్స్ ఫైటా..?

By:  Tupaki Desk   |   29 April 2022 11:42 AM GMT
ట్విట్ట‌ర్ లో మ‌ళ్లీ ఆట షురూ.. మంచు విష్ణు డాన్స్ ఫైటా..?
X
హీరో, `మా` అధ్య‌క్షుడు మంచు విష్ణ గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. `మా` అసోసియేష‌న్‌ ఎన్నిక‌ల వేళ సంచ‌ల‌నం సృష్టించిన మంచు విష్ణు ఆ త‌రువాత కూడా అదే పంథాని కొన‌సాగిస్తూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు. మా ఎన్నిక‌ల్లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ పై మంచు విష్ణ విజ‌యం సాధించి `మా` అధ్య‌క్ష పీఠాన్ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్ రాజ్ తో పాటు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పైనా సెటైర్లు వేసిన మంచు వార‌బ్బాయి ఆ త‌రువాత ఏపీ ముఖ్య‌మంత్రిని ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌డం, అది `మా` అధ్య‌క్ష హోదాలో క‌ల‌వ‌లేదంటూనే అధికారిక మీటింగ్ అని చెప్ప‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

దీంతో మంచు విష్ణుని నెటిజ‌న్ లు సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. చివ‌రికి ప‌రిస్థితి ఎక్క‌డిదాకా వెళ్లిందంటే మోహ‌న్ బాబు మీడియా ముఖంగా సోష‌ల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న వారిపై పరువు న‌ష్టం దావా వేస్తాను అనేంత వ‌ర‌కు వెళ్లింది. ఆ త‌రువాత వివాదం స‌మ‌సిపోయింది. అంతా సైలెంట్ అయిపోయారు. కానీ గ‌త కొన్ని రోజులుగా మంచు విష్ణు మాత్రం సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తూనే వున్నాడు.

జి. నాగేశ్వ‌ర‌రెడ్డి డైరెక్ష‌న్ లో ప్ర‌స్తుతం మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. పాయ‌ల్ రాజ్ పుత్‌, స‌న్నీలియోన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వీరికి సంబంధించిన అప్ డేట్ లు అందిస్తూ నిత్యం సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న మంచు విష్ణు ఇటీవ‌ల స‌న్నీలియోన్ వంట‌కం అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసి ర‌చ్చ చేశారు. తాజాగా శుక్ర‌వారం మంచు విష్ణు పెట్టిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. డాన్స్ రిహార్స‌ల్స్ మొద‌లైంద‌ని, దీంతో నాబాడీలోని ప్ర‌తీ పార్ట్ హ‌ర్ట్ అయింద‌ని ట్వీట్ చేశాడు.

దీంతో నెటిజ‌న్స్ ఎవ‌రికి తోచింది వారు ఈ ట్వీట్ ని అన్వ‌యించుకోవ‌డం మొద‌లు పెట్టారు. `ఆచార్య‌`ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ వుంద‌ని కొంత మంది కామెంట్ చేస్తే మ‌రి కొంత మంది డాన్సా? ఫైట్ సీన్ అయ్యుంట‌దిలే అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ సెటైర్లు గ‌మ‌నించిన మంచు విష్ణు నా కొరియోగ్రాఫర్ కూడా నా డాన్స్ మూవ్ మెంట్స్ ఫైట్ సీక్వెన్స్ లా వుంటాయ‌ని అంటున్నాడు అని రిప్లై ఇచ్చాడు. అంతే కాకుండా త‌న కామెడీ హీర‌ర్ లా వుంటుంద‌న్న నెటిజ‌న్ కు నేను కామెడీ , ఫైట్స్ లో చాలా స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చాడు. స‌ర‌దాగా మ‌ళ్లీ మొద‌లైన ట్విట్ట‌ర్ సంభాష‌ణ మ‌ళ్లీ ఏ ట‌ర్న్ తీసుకుంటుందో చూడాలి అంటున్నాయి ఇండస్ట్రీ వ‌ర్గాలు.