Begin typing your search above and press return to search.
మంచు బాబు ఛాలెంజ్ చూశారా?
By: Tupaki Desk | 15 April 2016 5:43 AM GMTమంచు విష్ణువర్ధన్ బాబుకు హిట్టు కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. అప్పుడెప్పుడో ‘దూసుకెళ్తా’ అతడికి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా ఆడలేదు. గత రెండు సినిమాలు డైనమైట్.. ఎర్రబస్సు అయితే పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తన సినిమాలు సూపర్ హిట్ అనిపించుకోవడం తర్వాత.. ముందు కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు అన్నట్లు వెయిట్ చేస్తున్నాడు విష్ణు. అతడి ఆశను ‘ఈడోరకం ఆడోరకం’ నెరవేర్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది. రొటీన్ అని.. లాజిక్ లేదని.. ఇలాంటి విమర్శలతో పాటే.. టైంపాస్ అయిపోతుంది.. ఒక్కసారికి ఓకే అన్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా తెచ్చుకుంది ‘ఈడోరకం ఆడోరకం’.
దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రమోషన్ గట్టిగా మొదలుపెట్టేశారు. సాయంత్రానికల్లా సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు రెడీ చేసేశారు. పనిలో పనిగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపేలా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేశారు. ప్రేక్షకుల్ని కవ్వించేలా ఓ సవాల్ కూడా విసిరాడు మంచు విష్ణు. 100 పర్సంట్ నవ్వించే సినిమా ఇదని.. ఈ సినిమా చూసి నవ్వకుండా బయటికి వస్తారేమో చూడండి అంటూ సవాల్ విసిరాడు విష్ణు. నిజంగా మీరు ఈ సినిమా చూసి నవ్వకుంటే.. ఎంజాయ్ చేయకుంటే టికెట్ తిరిగి తమకు పంపించాలని.. పూర్తి టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని అంటున్నాడతను. అయినా యాభయ్యో వందో పెట్టి సినిమా చూసేవాళ్లు టికెట్లు వెనక్కి పంపించడానికి ఏం ఆసక్తి చూపిస్తారు కానీ.. ఇలాంటి సవాల్ విసిరాడంటే ఈ సినిమా సంగతేంటో చూద్దాం అని జనాలు థియేటర్లకు మాత్రం వచ్చే అవకాశముంది. మొత్తానికి ప్రమోషన్లో ఈ కొత్త ఎత్తుగడేదో బాగానే ఉంది విష్ణు భాయ్!