Begin typing your search above and press return to search.

వివేకాను ఇంత నీచంగానా: మంచు విష్ణు

By:  Tupaki Desk   |   16 March 2019 11:40 AM GMT
వివేకాను ఇంత నీచంగానా: మంచు విష్ణు
X
మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత జగన్ చిన్నాన్న అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. వైఎస్ అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వివేకనంద అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి వైఎస్ జగన్ సహా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు.

ఇక వైఎస్ వివేకానందరెడ్డి.. సినీ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సమీప బంధువు. మంచు విష్ణు భార్య విరోనిక వైఎస్ కుటుంబానికి చెందిన ఆడబిడ్డే. వైఎస్ సోదరుడి కుమార్తె ఈమె. హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి విరోనికకు స్వయానా చిన్నాన్న. అందుకే మోహన్ బాబు, మంచు విష్ణు, విరోనికా ఆయన కుటుంబ సభ్యులందరూ వివేకా అంత్యక్రియలకు హాజరై ఆయనకు అశ్రునివాళులర్పించారు. చిన్నాన్న మృతిని భరించలేక విరోనిక మృతదేహం వద్ద భోరున విలిపించింది.

ఇక అంత్యక్రియలకు హాజరై వచ్చాక మంచు విష్ణు ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా మృతి గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం.. రాజకీయ నాయకుల కామెంట్స్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి అంకుల్ మృతి గురించి కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ వింటున్నా.. వారి మాటలు వింటుంటే మానవత్వం మురికి కాలువలో కొట్టుకుపోతున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి క్రూరమైన చర్యలని ఖండించాల్సిందిపోయి నీఛంగా మాట్లాడుతున్నారు..’ అని మంచి విష్ణు ఫైర్ అయ్యారు. చావుని కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటూ బురదజల్లుతున్నారని.. చూస్తుంటే వీళ్లకు కనీసం బుర్ర కూడా ఉన్నట్లు కనిపించడం లేదని మంచు విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక వైఎస్ వివేకాకు నివాళులర్పించిన అనంతరం మోహన్ బాబు కూడా ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘోరాలను భగవంతుడు చూడా గమనిస్తూనే ఉంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజాత శత్రువులాంటి వ్యక్తి అని అందరూ పొగిడే వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని.. మోహన్ బాబు ప్రశ్నించారు. పోలీసులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని మోహన్ బాబు కోరారు. హత్య విషయంలో అనుమానాలున్నాయని.. విమర్శలు మానుకోవాలని సూచించారు.