Begin typing your search above and press return to search.

కథ నమ్మి అప్పులు చేసి నిర్మించా.. ఒత్తిడి పెరిగింది: మంచు విష్ణు

By:  Tupaki Desk   |   18 March 2021 4:30 PM GMT
కథ నమ్మి అప్పులు చేసి నిర్మించా.. ఒత్తిడి పెరిగింది: మంచు విష్ణు
X
సినీప్రపంచం అంటేనే మాయ. ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. ముఖ్యంగా తమ సినిమాలను నిర్మిస్తూ నటించే హీరోలను చూస్తే ఆందోళన కలుగతుంది. ఎందుకంటే సినిమా కోసం వారు అప్పులు చేసే స్థాయికి వెళ్తారు. తీరా అప్పులు చేసి సినిమా తీసాక ఫలితం పాజిటివ్ అయితే పరవాలేదు. కానీ నెగటివ్ అయితే మాత్రం అప్పులు మిగిలి కుటుంబ పరిస్థితి కూడా తారుమారు అయ్యే అవకాశం ఉంది. అంతటి రిస్క్ చేయడం అవసరమా..? అని అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ ఆ హీరో రిస్క్ చేసేసాడు. ఎవరో కాదు హీరో మంచు విష్ణు. తాజాగా తన సినిమా 'మోసగాళ్లు'కు సంబంధించి పలు విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నాడు.

"కేవలం కథను నమ్మి ఈ సినిమా పై నా తాహత్తుకు మించిన బడ్జెట్ పెట్టాను. నా మార్కెట్ ఏంటో నాకు తెలుసు. కానీ స్టోరీ డిమాండ్ మేరకు పెట్టాల్సి వచ్చింది. మొదట్లో కేవలం హాలీవుడ్ లో చేద్దామని అనుకున్నాం. కానీ ఇలాంటి రియల్ ఐటీ స్కామ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులకు కూడా చూపిస్తే బాగుంటుందని రూపొందించాము. ఈ సినిమాకు ఫస్ట్ డ్రాఫ్ట్ కథ నేనే రాసాను. పేదింట్లో ఉండే ఇద్దరు బ్రదర్ - సిస్టర్ ఇంగ్లీష్ వారిని మోసగించి ఆన్లైన్ లో వేలమందిని మోసం చేసి డబ్బు కొట్టేస్తారు. వీరి దృష్టిలో ఇంగ్లీష్ వాళ్లంతా ధనవంతులే. కానీ ఆ మోసంలో ఎంతోమంది పేదవాళ్ళ లైఫ్ నాశనం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కథనాలు, ఆర్టికల్స్, పేపర్ న్యూస్ అన్ని రైట్స్ కొనేసాం.

ఈ సినిమాను కన్నడలో 130, ఛత్తిస్ ఘడ్ లో 40 థియేటర్లతో పాటు హిందీ, తమిళంలో రిలీజ్ చేస్తున్నాం. మా సినిమాను దేశవ్యాప్తంగా యూఎఫ్ఓ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకోసం చాలా అప్పులు చేసాను. అప్పులోళ్ళు కూడా కంగారు పడుతున్నారు. నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది. ప్రతి సినిమాకు టెన్షన్ ఉంటుంది కాని మనమే డబ్బుపెట్టిన సినిమాల విషయంలో మరింత టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రొడక్షన్ పరంగా మూడు వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాం. మేలో మోసగాళ్లు ఇంగ్లీష్ వెర్షన్ పూర్తిచేస్తాము" అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. మార్చ్ 19న ఈ సినిమా విడుదల అవుతుండగా.. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జెఫ్రి గీచిన్ దర్శకత్వం వహించాడు.