Begin typing your search above and press return to search.
ఆరు పలకలు .. అదిరాయి గురూ
By: Tupaki Desk | 23 Nov 2015 9:59 AM ISTఇప్పుడున్న హీరోల్లో కండల హీరోలకు కొదవేం లేదు. ప్రభాస్ - రానా - బన్ని - రామ్ చరణ్ - నితిన్ .. ఇలా హీరోలంతా బాడీ బిల్డర్లే. టాలీవుడ్ కి 6ప్యాక్ ని పరిచయం చేసిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. పదేళ్ల క్రితమే ఆరు పలకల దేహాన్ని చూపించాడు బన్ని. ఆ తర్వాత నితిన్ కూడా 6 ప్యాక్ తో ఆకట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో ప్రభాస్ - రానా లాంటి హీరోలు పలకల దేహంతో ఆకట్టుకున్నారు. వీళ్ల కంటే ముందు, వెనక ఆరు పలకల కోసం ప్రయత్నించిన హీరోలెందరో. అంతెందుకు మంచు మనోజ్ ఈపాటికే కండల్ని పెంచి రొమ్ములు విరిచిన సందర్భాలున్నాయి. అయితే మంచు విష్ణు మాత్రం ఇంతకాలం కాస్త సాఫ్ట్ అండ్ స్వీట్ గానే కనిపించాడు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడో ఏమో? లేటెస్టుగా అతడు రూపురేఖల్ని అసాధారణంగా మార్చేశాడు.
ఇప్పుడు మారిన విష్ణులా కనిపిస్తున్నాడు. నడుము చుట్టూ తీరైన కండరాల్ని తీర్చిదిద్ది ఆరు పలకల దేహంతో కనిపించాడు.లేటెస్ట్ మూవీ సరదా కోసం ఈ ఫీట్ వేశాడు. ఈ చిత్రంలో విష్ణు మునుపటి కంటే స్మార్ట్ లుక్ తో ఆకట్టుకోనున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై డి.కుమార్ సమర్పణలో సోమా విజయప్రకాష్ - పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.కార్తీక్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు ఫస్ట్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది. అదీ సంగతి.