Begin typing your search above and press return to search.
‘ఢీ’ ఫేవరెట్ కాదు.. అనుక్షణం
By: Tupaki Desk | 29 Jan 2018 3:54 AM GMT‘గాయత్రి’ సినిమా ఆడియో వేడుకలో రామ్ గోపాల్ వర్మను పొగిడి అందరినీ ఆశ్చర్యపరిచాడు మంచు విష్ణు. తన నటన మీద తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మే అని అతనన్నాడు. తాను కొంచెం తక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నపుడు వర్మతో ‘అనుక్షణం’ సినిమా చేశానని.. అప్పుడే తాను నటుడిగా ఎంతో నేర్చుకున్నానని.. కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నానని.. అందుకు వర్మకు థ్యాంక్స్ అని అన్నాడు విష్ణు. అందరూ తాను ‘ఢీ’లో బాగా చేశావని కాంప్లిమెంట్ ఇస్తుంటారని.. ఐతే ‘ఢీ’ సినిమా.. అందులో క్యారెక్టర్ తన ఫేవరెట్ కాదని.. ఈ మాట చెబితే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనను తిడుతుందటారని.. కానీ దాని కంటే ‘అనుక్షణం’ సినిమా.. అందులో తన పాత్రే తనకు ఇష్టమని విష్ణు అన్నాడు.
‘గాయత్రి’ సినిమా కథ తనకు చెప్పగానే ఇందులో ఒక పాత్ర తాను చేస్తానని రచయిత డైమండ్ రత్నబాబు.. దర్శకుడు మదన్ లకు చెప్పానని.. కానీ ఆ పాత్రకు వాళ్లు తనను కాకుండా ఇంకెవరినో అనుకున్నారని.. ఐతే తాను చేస్తాననేసరికి ఏం చెప్పాలో అర్థంకాని అయోమయంలో పడిపోయారని విష్ణు తెలిపాడు. ప్రతి నటుడికీ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అనదగ్గ పాత్ర ఒకటి వస్తుందని.. ఆ పాత్ర వల్ల మంచి నటుడిగా పేరు తెచ్చుకోవచ్చని.. లేదా చెడ్డ పేరు రావచ్చని.. ‘గాయత్రి’లో తాను చేసింది అలాంటి పాత్రే అని.. ఈ పాత్రతో తాను మెప్పిస్తే నంబర్ వన్ నటుడిని అవుతానని భావిస్తున్నానని విష్ణు చెప్పడం విశేషం. ‘గాయత్రి’ తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా అని.. ఆ పాయింటే తమను ఈ సినిమా చేసేలా చేసిందని విష్ణు తెలిపాడు. తనకు ఈ సినిమాలో శ్రియ జోడీగా నటించడం పట్ల చాలాసార్లు ఆశ్చర్యపోయానని.. తాను చదువుకునే రోజుల్లో శ్రియ హీరోయిన్ గా నటించిన సినిమాలు చూసి ఈ అమ్మాయి భలే ఉంది కదా అనుకునే వాళ్లమని చెబుతూ విష్ణు నవ్వేశాడు.