Begin typing your search above and press return to search.
ఆ నలుగురి కంటే ఆయన గొప్పోడా?
By: Tupaki Desk | 5 Oct 2021 6:30 AM GMT`మా` అసోసియేషన్ ఎన్నికలు సామాన్య జనానికి పిచ్చెక్కిస్తున్నాయి. ఇవి ఆర్టిస్ట్ లకు సంబంధించిన ఎన్నికలా? లేక బై ఎలక్షన్ లా? అంటూ అంతా అవాక్కవుతున్నారు. దానికి కారణం ఈ ఎన్నికల్లో పోటీపడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సాధారణ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల తిట్ల పురాణం తరహాలో విమర్శనాస్త్రాలు సంధించుకోవడమే.
ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్.. హీరో మంచు విష్ణు పోటీపడుతున్నారు. అయితే మెజారిటీ వర్గం మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ కే మద్దతుగా నిలుస్తున్నారు. పైగా మెగాస్టార్ చిరంజీవి మద్దతుకూడా చిరుకే వుండటంతో ఆయన గెలుపు లాంఛనమనే భావన అందరిలోనూ కనిపిస్తోంది. అయితే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ `మా`లో లుకలుకలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ .. హీరో మంచు విష్ణు.. నరేష్ లపై పదునైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
అయితే ప్రకాష్ రాజ్ విమర్శలపై మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. ఆయన ఎప్పటికప్పుడు `అపరిచితుడు`లో విక్రమ్ లా మారిపోతున్నారని విమర్శించారు. అంతే కాకుండా ఇండస్ట్రీకి అవార్డులు తీసుకొచ్చింది తానే అని గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా? అవి ఆయనే తీసుకొచ్చాడా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్.. ఏ ఎన్నార్.. మా నాన్న.. చిరంజీవిగార్ల కంటే ప్రకాష్ రాజ్ గొప్పోడా? అని విమర్శలు గుప్పించారు. ఇండస్ట్రీ తనకు అన్నీ ఇచ్చిందని.. ఈ తరహాలో ఇంత వరకు `మా` ఎన్నికలు జరగలేదని..ఇలా జరగడానికి కారణం ప్రకాష్ రాజేనని అన్నారు మంచు విష్ణు.
ఇన్ని మాటలు చెబుతున్న ప్రకాష్ రాజ్ ఎలాంటి వాడో ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతనీ.. ప్రతి దర్శకుడినీ అడిగితే చెబుతారని.. సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిట్టారని..దాని వల్లే ఆయనని తీసేసి సోనుసూద్ ని పెట్టుకున్నారని...అంత పొగరు ప్రకాష్ రాజ్ కి ఎందుకు? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంచు విష్ణు.
ప్రకాష్ రాజ్ పై నరేష్ అసహనం
ఇటీవల ఓ సమావేశంలో ప్రకాష్ రాజ్ పై `మా` గత అధ్యక్షుడు సీనియర్ నరేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మా మెంబర్ల పుట్టిన రోజులకు ఎప్పుడైనా ఫోన్ చేసి విష్ చేసారా? ఎందుకు ఉన్నట్లుండి `మా` మీద ప్రేమ పుట్టుకొచ్చింది? మీకు మీరుగా వచ్చారా? లేక ఎవరైనా తెచ్చారా? మీరు కేవలం గ్రామాల్నే దత్తత తీసుకున్నారు? నేను ఏకంగా జిల్లానే దత్తత తీసుకున్నా? అందులో 60 మండలాలు ఉన్నాయి. ఇంత చేసాం..అంత చేసామని చెప్పుకునే వాళ్లు `మా`ని ఎందుకు దత్తత తీసుకోలేదు. `మా` లో ఒక్క మనిషినైనా దత్తత తీసుకున్నారా? అంటూ ప్రకాష్ రాజ్ ని విమర్శించారు.
మా అమ్మ (విజయ నిర్మల) నెలకి 15 వేలు `మా`కు ఇచ్చేది. ఏడాదికి ఒక మనిషిని దత్తత తీసుకునే వాళ్లం. మీరేంటి రెస్టారెంట్ లో డిస్కౌంట్లు.. పబ్ ల్లో డిస్కోలు ఆడాలంటున్నారు? ఏంటో అర్ధం కాలేదని నరేష్ అసహనం వ్యక్తం చేసారు. అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఐదారుగురు సభ్యులు అధ్యక్ష పదవికి పోటీ పడతారని చర్చ సాగినా కానీ చివరి నిమిషంలో కొందరు విరమించుకున్నారు. సీవీఎల్ వంటి సీనియర్ నటుడు రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.