Begin typing your search above and press return to search.
నిఖిల్ కి నేనున్నానంటున్నాడు!
By: Tupaki Desk | 2 Aug 2022 11:40 AM GMTయంగ్ అంట్ టాలెంటెడ్ స్టార్ నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'కార్తికేయ 2'. చందూ మొండేటి రూపొందించిన ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. అభిషేక్ అగర్వాల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్, టీజి. విశ్వప్రసాద్ నిర్మించారు. 2014లో వచ్చిన 'కార్తికేయ' మూవీకి సీక్వెల్ గా రూపొందించారు.
ఆగస్టు 12న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నిఖిల్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకోమ్మని బెదరించారని, ఇప్పట్లో నీ సినిమా రిలీజ్ కాదని, అక్టోబర్ లేదా నవంబర్ కు వెళ్లిపొమ్మన్నారని ఆ మాటలు విన్నాక భావోద్వేగానికి గురై ఏడ్చేశానని నిఖిల్ వెల్లడించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిఖిల్ ని అంతగా బెదిరించింది ఎవరు? .. ఎందుకు తన సినిమా రిలీజ్ ని ఆపుతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. నిఖిల్ భావోద్వేగానికి లోనైన తీరుకు చాలా మంది నెటిజన్ లు హార్ట్ అయ్యారు.
తనకు అండగా నిలుస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే హీరో మంచు విష్ణు.. నిఖిల్ కు అండగా నిలిచారు. తమ్ముడూ నీకు నేనున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. 'ధైర్యంగా వుండు. ప్రతీ ఒక్కరూ కంటెంట్ విన్నవుతుందని అంగీకరిస్తారు' అని ట్వీట్ చేశారు.
మంచు విష్ణు ట్వీట్ కు నిఖిల్ రిప్లై ఇచ్చారు. 'విష్ణు భాయ్ నీ మాటలు మా టీమ్ కు కొండంత అండను ఇస్తున్నాయి' అన్నాడు. అయితే ఈ విషయంలో మంచు విష్ణుని నెటిజన్ లు ఆడుకుంటున్నారు.
నీకే దిక్కులేదు నువ్వొచ్చి ఆదుకుంటావా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం 'జిన్నా' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ వివాదం కారణంగా ఈ మూవీ వార్తల్లో నిలిచింది. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.