Begin typing your search above and press return to search.

కాజల్ స్టార్ హీరోయిన్..అక్క పాత్రకి ఒప్పుకోవడమే గొప్పవిషయం!

By:  Tupaki Desk   |   16 March 2021 3:45 AM GMT
కాజల్ స్టార్ హీరోయిన్..అక్క పాత్రకి ఒప్పుకోవడమే గొప్పవిషయం!
X
మంచు విష్ణు తాను హీరోగా 'మోసగాళ్లు' అనే భారీ బడ్జెట్ మూవీని నిర్మించాడు. సునీల్ శెట్టి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కాజల్ తళుక్కున మెరిసి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికపై ఈ సినిమాను గురించి విష్ణు మాట్లాడాడు.

"ఈ సినిమా చేయడానికి సునీల్ శెట్టి గారు అంగీకరించినప్పుడే నేను సగం సక్సెస్ అయ్యాను. ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక కాజల్ కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి .. ఎందుకంటే, హీరోయిన్ గా టాప్ పొజీషన్లలో ఉన్నప్పుడు ఎవరూ కూడా అక్కగా చేయడానికి ఒప్పుకోరు. కానీ కథ పంపించగానే ఆమె వినేసి ఓకే చెప్పేసింది .. అది చాలా గొప్ప విషయం. అదృష్టం బాగుండి థియేటర్లు ఓపెన్ అయ్యాయి కాబట్టి సరిపోయింది .. లేదంటే తనకి పిల్లలు పుట్టిన తరువాత ఈ సినిమా రిలీజ్ అయ్యేదేమో అని నవ్వేశాడు.

ఈ సినిమాలో సునీల్ శెట్టిగారితో నాకు ఒక ఫైట్ ఉంది. నా కెరియర్లో బెస్ట్ యాక్షన్ సీన్ గా నేను భావిస్తున్నాను. సునీల్ శెట్టి గారి ఏజ్ ను బట్టి ఆయనతో యాక్షన్ సీన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కొట్టాలి .. కాస్త సున్నితంగా పట్టుకోవాలి అనుకున్నాను. కానీ ఆయన కొట్టిన దెబ్బకి నేను మూడు అడుగులు వెనక్కి వెళ్లాను. ఆయన దెబ్బలను తట్టుకోవడానికే నేను జిమ్ చేసినట్టుగా అనిపించింది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. మీరంతా థియేటర్ కి వెళ్లి ఈ సినిమాను తప్పకుండా చూడాలి" అని చెప్పుకొచ్చాడు.