Begin typing your search above and press return to search.
డాడీ డ్యూటీ చేసిన మంచు విష్ణు!
By: Tupaki Desk | 27 Aug 2016 5:14 AM GMTఫ్యామిలీతో గడపం కంటే గొప్ప టైంపాస్ ఇంకేముంటుంది చెప్పండి ఎవరికైనా. ఎన్ని పనులున్నా పిల్లలతో హాయిగా గడపాలని అందరికీ ఉంటుంది. వాళ్లతో కాసేపు ఆడుకుంటే కలిగే సంతృప్తే వేరు. అయితే, సెలెబ్రిటీలు తమ పనుల్లో బిజీబిజీగా ఉంటూ కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నాం అంటారు. కొంతమంది మాత్రం క్వాలిటీ టైమ్ కుటుంబానికి కేటాయిస్తూ... ఫ్యామిలీ లైఫ్ ను మిస్ అవ్వరు. అలాంటి హీరోల్లో ఒకరు మంచు విష్ణు. తన ఇద్దరు ముద్దుల కూతుళ్లతో ఆడుతూ పాడుతూ గడిపేందుంకు చాలాటైమ్ కేటాయిస్తూ ఉంటాడు. ఖాళీ దొరికిందంటే తన భార్యా పిల్లలతో అవుటింగ్కి వెళ్తుంటాడు విష్ణు.
అవుటింగ్ అంటే అందులో షాపింగ్ పని ఉంటుంది కదండీ. ఇక, భార్యలు షాపింగ్ మొదలుపెడితే ఎలా ఉంటుందో భర్తలకు తెలియందా..? గంటల సమయం వెయిటింగ్ లో అలాఅలా గడిచిపోతూ ఉంటుంది. తన భార్య వినీ షాపింగ్ చేస్తుంటే... పిల్లలతో చేసిన డాడీ డ్యూటీ ఇదీ అంటూ ఓ చిన్న వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు విష్ణు. పిల్లలు అరియానా - వివియానా డాన్సులు చేస్తూ అలరించారు. విష్ణు ఎలాంటి స్టెప్ వేస్తే.. వాళ్లూ అలానే, అదే రిథమ్ లో డాన్స్ చేశారు. డాడీ డ్యూటీస్ అంటూ విష్ణు పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా అలరిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. విష్ణుతో పిల్లలిద్దరూ చేసిన డాన్సులను కాసేపు సరదాగా చూసెయ్యండి.