Begin typing your search above and press return to search.
భక్త కన్నప్ప కథకు మంచు విష్ణు వెర్షన్
By: Tupaki Desk | 26 March 2021 9:30 AM GMTకొన్నేళ్లుగా మంచు విష్ణు సినిమా రిలీజైన ప్రతిసారీ.. ఆ సినిమాకు వచ్చే నష్టాల లెక్కల గురించే మాట్లాడుకోవాల్సి వస్తోంది. సినిమా సక్సెస్ అయి లాభాలు రావడం సంగతలా ఉంచితే.. పెట్టుబడి రికవర్ చేయడం చాలా కష్టమైపోతోంది విష్ణు సినిమాలకు. తాజాగా మంచు విష్ణు నుంచి వచ్చిన ‘మోసగాళ్ళు’ సినిమాకు అతడి గత సినిమాలతో పోలిస్తే కొంచెం బజ్ కనిపించింది. కానీ ఈ చిత్రానికి కూడా బ్యాడ్ టాకే రావడంతో సినిమా నిలబడలేదు. విష్ణు చెప్పిన బడ్జెట్ లెక్కలకు, ఈ సినిమాకు వచ్చిన వసూళ్లకు అసలు పొంతనే లేదు. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిద పాలైందనే అనుకోవాలి. పాన్ ఇండియా సినిమా అని, హాలీవుడ్లో ఇంగ్లిష్ వెర్షన్ రిలీజ్ అని విష్ణు చాలా హడావుడి చేశాడు. తీరా చూస్తే మన తెలుగులో కూడా ఈ సినిమాను జనాలు పట్టించుకోలేదు. ఇతర భాషల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ‘మోసగాళ్ళు’ సినిమాను హాలీవుడ్ దర్శకుడితో తీయించడమే చాలా విడ్డూరంగా అనిపించింది అందరికీ.
‘మోసగాళ్ళు’ సినిమా అనుభవంతో అయినా మంచు విష్ణు మారతాడేమో అనుకుంటే.. నేల మీదికి దిగొస్తాడేమో అనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. విష్ణు ఎప్పట్నుంచో చెబుతున్న ‘భక్త కన్నప్ప’కు సంబంధించి తన భారీ ప్రణాళికలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. విష్ణు హీరోగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి ఇంతకుముందు సన్నాహాలు జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ప్రాజెక్టు నుంచి భరణి తప్పుకున్నట్లుగా విష్ణు సంకేతాలిచ్చాడు. భరణి అందించిన ‘భక్త కన్నప్ప’ స్క్రిప్టుకు తాను హాలీవుడ్లో ఒక టీంతో ఒక వెర్షన్ రాయించానని.. ఆ తర్వాత తాను కూడా ఒక వెర్షన్ రాశానని.. తాను రాసిన వెర్షన్ తీసుకుని రచయిత సాయిమాధవ్ బుర్రా కథను సిద్ధం చేస్తున్నారని విష్ణు వెల్లడించాడు. భక్త కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్టు అని.. ‘ఢీ అండ్ ఢీ’ తర్వాత ఇది ఉంటుందని అతను చెప్పాడు. భక్త కన్నప్ప ఒక పెద్ద యాక్షన్ మూవీ అని, భారీ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కిస్తామని అతనన్నాడు. చూస్తుంటే ‘మోసగాళ్ళు’ తరహాలోనే తన పరిధికి మించిన సినిమాతో విష్ణు పెద్ద సాహసానికే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.