Begin typing your search above and press return to search.

నా కుటుంబాన్ని లాగితే.. ఇదే లాస్ట్!-విష్ణు మంచు

By:  Tupaki Desk   |   6 Oct 2021 7:30 AM GMT
నా కుటుంబాన్ని లాగితే.. ఇదే లాస్ట్!-విష్ణు మంచు
X
మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎల‌క్ష‌న్స్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అక్టోబ‌ర్ 10న ఫిలింఛాంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఓట్లు వేసేందుకు దాదాపు 500 మంది ఆర్టిస్టులు వ‌స్తార‌ని అంచనా వేస్తున్నారు. ఇత‌రుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఆప్ష‌న్ కూడా ఉంది కాబ‌ట్టి ఎక్క‌డి నుంచి అయినా ఓటేసేందుకు సానుకూల‌త క‌నిపిస్తోంది.

ఇదిలా ఉంటే ``ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ వ‌ర్సెస్ మంచు విష్ణు ప్యానెల్`` .. మాట‌ల యుద్ధం ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది. తాజాగా మంచు విష్ణు నేరుగా ప్ర‌కాష్ రాజ్ ని ఉద్ధేశించి ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది. ``ఇక మర్యాద ఇచ్చేది లేదు.. ఇదే లాస్ట్!`` అంటూ విష్ణు మంచు చేసిన కామెంట్ ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ లో వేడి పెంచింది.

మా కుటుంబంపైనే కామెంట్ చేస్తారా? అంటూ మంచు విష్ణు సీరియ‌స్ అయ్యారు. మా ఫ్యామిలీ ఏం చేసింది. కావాలంటే నన్ను మాత్రమే టార్గెట్ చేయండి. పాత నిజాల‌న్నీ మర్చిపోయారా. 2004 - 2005 లో ఏం జరిగిందో గుర్తు లేదా? శ్రీహరి అంకుల్ బ్రతికి ఉంటే మీకు సరైన గుణపాఠం చెప్పేవారు. ఆయన ప్రస్తుతం స్వర్గంలో ఉన్నారు. ఆయనే మీకు తగ్గట్టుగా సరైన సమాధానం చెప్పేవారు.. అంటూ విష్ణు వ్యాఖ్యానించారు.

అంతేకాదు వ‌స్తాడు నారాజు షూటింగ్ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడిపై ప్ర‌కాష్ రాజ్ దుర్భాష‌లాడార‌ని దానిని ఇన్నాళ్లు తాను ఓపెన్ అవ్వ‌లేద‌ని ఇప్పుడు చెప్పాల్సొచ్చింద‌ని కూడా అన్నారు. ఈరోజు నా కుటుంబ సభ్యులను మీరు అనవసరంగా లాగుతున్నారు. సాఫీగా సాగే ఈ ఎలక్షన్స్ లో కూడా వివాదాస్ప‌దం చేస్తున్నార‌ని విష్ణు ఆవేద‌న చెందారు.

ఈవీఎం కావాలి బ్యాలెట్ పేపర్స్ వద్దు అంటున్నారు.. నేను గెలిచాక ఈవిఎంల‌లో కూడా తేడా ఉంద‌ని నింద వేస్తార‌ని ప్ర‌కాష్ రాజ్ ని అట‌కాయించారు విష్ణు. ఏదో మోసం జ‌రిగిందని అంటావు అంటూ కౌంట‌ర్ వేసారు. మీ ముందే పుట్టి పెరిగాను.. మా కుటుంబం గురించి తెలీదా అంటూ హీరో శ్రీ‌కాంత్ నుద్ధేశించి విష్ణు వ్యాఖ్యానించారు. మా నాన్న గారిని మీరు అన్నా అని పిలుస్తారు. ఇటీవ‌ల క‌లుసుకుని గంట పైగా మాట్లాడుకున్నాం. నెగెటివిటీ వ‌ద్ద‌ని అనుకున్నాం అంటూ విష్ణు గుర్తు చేసారు.

మా కుటుంబ స‌భ్యుల‌ను వివాదాల్లోకి లాగితే మ‌ర్యాద ఇచ్చేదే లేదు ప్ర‌కాష్ రాజ్ గారు.. ఇదే లాస్ట్ .. అని కూడా విష్ణు హెచ్చ‌రించారు. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు వార్ మ‌రో నాలుగు రోజులు ఇదే తీరుగా కొన‌సాగ‌నుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఒక‌రిపై ఒక‌రు వాక్భాణాల‌తో ఎల‌క్ష‌న్ లో వేడిని ప‌రాకాష్ట‌కు చేర్చారు.