Begin typing your search above and press return to search.

తరిమేస్తా అన్న శ్రీమతి.. గొడవ వద్దు అన్నవిష్ణు!

By:  Tupaki Desk   |   8 Aug 2019 3:59 PM GMT
తరిమేస్తా అన్న శ్రీమతి.. గొడవ వద్దు అన్నవిష్ణు!
X
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు ఓ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనే ఇమేజ్ ఉంది. తనకు ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో సమయం గడిపేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సతీమణి విరానిక.. పిల్లలు వివియానా.. అవియానా.. అవ్రామ్ భక్తతో సమయం గడుపుతూ ఉంటాడు. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫోటోలను కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తూ ఉంటాడు.

విష్ణు - విరానిక జంటకు త్వరలో తమ నాలుగవ సంతానం రాబోతోంది. విరానిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో మంచు కుటుంబం అంతా న్యూ బేబీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో విష్ణు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న ఓ అప్డేట్ ను హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ కాజల్ తో తీవ్రంగా చర్చోపచర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చానని.. తన సతీమణి విరానిక డెలివరీని ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాదనేది ఆ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ తో నెటిజన్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాస్త ఘాటు భాషలోనే విష్ణుపై కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇక్కడ రాయలేని విధంగా సెటైర్లతో.. పంచులతో ట్రోల్ చేశారు.

ఇదిలా ఉంటే విష్ణు సతీమణి ఆ 'డెలివరీ లైవ్ ' ట్వీట్ కు స్పందిస్తూ "అవును.. నిన్ను నేను ఇంట్లోనుంచి తరిమెయ్యబోతున్నా. కాజల్ అగర్వాల్ ఇది నిన్ను ఉద్దేశించినది కాదులే" అంటూ గట్టిగా మామగారు మోహన్ బాబు స్టైల్ లో వార్నింగ్ ఇచ్చింది. హోమ్ డిపార్ట్ మెంట్ నుండి హెచ్చరిక జారీ అయితే ఎంత పెద్ద హీరో అయినా ఏం చేస్తాడు? తప్పనిసరిగా భార్యామణి చెప్పినట్టు ఫాలో అవుతాడు. విష్ణు కూడా ఒక ఆదర్శ భర్త తరహాలో "విరానిక నుంచి వయోలెంట్ త్రెట్స్ కారణంగా ఇన్స్టా గ్రామ్ లైవ్ ఆలోచన మానుకున్నాను. నేను ఆమెతో గొడవ పెట్టుకోలేను.. ఆమెకు మోహన్ బాబుగారి సంపూర్ణ మద్దతు ఉంది" అంటూ ఓటమిని అంగీకరించాడు! ఏదేమైనా మంచు ట్వీట్.. తదనంతర పరిణామాలు సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేశాయని చెప్పకతప్పదు.