Begin typing your search above and press return to search.
కోలీవుడ్ కు మంచు విష్ణు ఫ్లాప్ సినిమా
By: Tupaki Desk | 12 Dec 2021 1:30 AM GMTఇటీవల `మా` ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొంది `మా` అసోసియేషన్ పగ్గాలు స్వీకరించిన హీరో మంచు విష్ణు ప్రస్తుతం శ్రీను వైట్ల రూపొందిస్తున్న `ఢీ అండ్ ఢీ` (డబుల్ డోస్) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ పక్క నిర్మాతగా తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తో `సన్ ఆఫ్ ఇండియా` చిత్రాన్ని నిర్మిస్తున్న మంచు విష్ణు మూడేళ్ల క్రితం విడుదలై తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాతో తమిళ ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు.
మూడేళ్ల క్రితం అంటే 2019 లో మంచు విష్ణు హీరోగా నటించగా విడుదలైన చిత్రం `ఓటర్`. జీ.ఎస్ . కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 21న విడుదలై దారుణ ఫలితాన్ని చవిచూసింది. మంచు విష్ణు చిత్రాల్లో అత్యంత డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇదే చిత్రాన్ని దాదాపు మూడేళ్ల విరామం తరువాత త్వరలో తమిళంలో రిలీజ్ చేయబోతున్నారు. తమిళంలో ఈ చిత్రానికి `కురల్ 388` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఓటర్ వ్యవస్థ ప్రక్షాళన నేపథ్యంలో ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందించారు.
ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అని చెప్పే కథనంతో రూపొందిన ఈ మూవీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తమిళంలో ఆకట్టుకునేనా అని ఇండస్ట్రీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తమిళంలో విడుదల కానున్న ఈ చిత్రంలోని తన పాత్రకు మంచు విష్ణు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈ చిత్రంలో సురభి హీరోయిన్ గా నటించింది. సంపత్ రాజ్,పోసాని కృష్ణ మురళీ, నాజర్ కీలక పాత్రల్లో కనిపించారు.