Begin typing your search above and press return to search.

తమన్ నుంచి ఇలాంటివే రావాలి

By:  Tupaki Desk   |   18 Jan 2018 12:35 PM GMT
తమన్ నుంచి ఇలాంటివే రావాలి
X
గత కొంత కాలంగా తమన్ మీద విమర్శలు వస్తున్న మాట నిజం. ఒకేతరహా బీట్స్ తో రిపీట్ ట్యూన్స్ ఇస్తున్నాడు అని మ్యూజిక్ లవర్స్ తరచుగా కామెంట్ చేస్తుంటారు. నిజానికి తమన్ మంచి మెలోడీస్ ఇవ్వగలడు అని గతంలోనే రుజువయ్యింది. కిక్ సినిమా మొదలుకొని మిరపకాయ్, బృందావనం, రగడ, దూకుడు, బిజినెస్ మెన్, నాయక్, రేస్ గుర్రం, బాద్షా, బలుపు లాంటి వాటిలో చక్కని మెలోడీస్ చాలానే ఇచ్చాడు. తర్వాత కొద్దిగా రొటీన్ ట్రాక్ లో పడిపోయిన తమన్ లో మెలోడీ సెన్స్ తగ్గిందేమో అనుకుంటున్న టైంలో మళ్ళి తనలోని మాస్టర్ కి పని కల్పిస్తున్నాడు. ఈ రోజు విడుదలైన భాగమతి సినిమాలో మందారా సాంగ్ వింటే ఎవరికైనా ఆ ఫీలింగ్ కలగడం సహజం. శ్రేయా ఘోషల్ స్వీట్ వాయిస్ లో 'మందార మందార కరిగే తెల్లారేలాగా' అంటూ చాలా హృద్యంగా ఎటువంటి బీట్స్ లేకుండా చెవులకు హాయిగా అనిపించే ట్యూన్ తో తమన్ సూపర్ అనిపించాడు.

ఇదే కాదు ఇటీవలే విడుదలైన వరుణ్ తేజ్ తొలి ప్రేమ సింగల్ ట్రాక్ ‘నిన్నిలా నిన్నిలా చూసానే’ అనే పాట కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతూ ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీ ఇదే అనేలా ఫీడ్ బ్యాక్ వచ్చింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట తక్కువ టైంలోనే చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ రకంగా చూస్తే తమన్ మళ్ళి తన ట్రాక్ లోకి వచ్చినట్టే అనుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా దూసుకుపోతున్న తమన్ ఆ మధ్య రాజు గారి గది 2 కి తను చేసిన కంపోజింగ్ చాలా ప్లస్ అయ్యింది. ఇలా మరో రెండు మూడు ఆల్బమ్స్ చేసాడంటే తమన్ మరింత వేగంగా వంద సినిమాల మార్క్ చేరుకోవచ్చు. రామ్ చరణ్-బోయపాటి శీను మూవీకి పరిశీలనలో తమన్ పేరే ఉంది. అది కూడా ఓకే అయ్యిందంటే తమన్ హవా మళ్ళి స్పీడ్ అందుకున్నట్టే.