Begin typing your search above and press return to search.

డాన్ దావుద్ ప్రియురాలు సినిమాల్లో రీఎంట్రీ?

By:  Tupaki Desk   |   17 July 2021 3:30 PM GMT
డాన్ దావుద్ ప్రియురాలు సినిమాల్లో రీఎంట్రీ?
X
ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాడ్ దావూద్ ఇబ్ర‌హీం అజేయ‌మైన ప్ర‌స్థానం గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. సినిమావాళ్లు ఎంతో ప‌రిశోధించి స్టోరీలు రాసుకునేంత‌ గొప్ప లైఫ్ స్టోరి ఆయ‌న‌ది. అయితే అప్ప‌ట్లో ఓ ప్ర‌ముఖ సినీ హీరోయిన్ తో అత‌డి ఎఫైర్ కూడా అంతే హాట్ టాపిక్ అయ్యింది. ఆవిడ ఎవ‌రో కాదు.. ది గ్రేట్ మందాకిని.

బాలీవుడ్ వెట‌ర‌న్ న‌టి మందాకిని బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ న‌టించారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచితురాలే. 80వ ద‌శ‌కంలో సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన సింహాస‌నం సినిమాలో విష క‌న్య పాత్ర‌లో న‌టించి మందాకిని మెప్పించారు. అటుపై `భార్గ‌వ రాముడు` వంటి చిత్రాల‌తోనూ ఆమె ఆక‌ట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు కెరీర్ ఆరంభంలో టాలీవుడ్ లో చేసిన చిత్రాలు ఆ త‌ర్వాత మందాకిని బాలీవుడ్ లో బిజీ అయ్యారు. కొన్నేళ్ల పాటు మందాకిని ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను ఓ ఊపు ఊపారు.

`రామ్ తేరీ గంగా మైలీ` చిత్రం మందాకిని కెరీర్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంతో మందాకిని ఎఫైర్ అప్ప‌ట్లో ఎంతటి సంచ‌ల‌నంగా మారిందో తెలిసిందే. ఆ స‌మ‌యంలో మందానికి హిందీలో అవ‌కాశాలు తగ్గాయి. ఆ త‌ర్వాత దావుద్ తోనే క‌లిసి స‌హజీవ‌నం చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కొన్నాళ్ల పాటు దుబాయ్ లో ఇరువురు ర‌హ‌స్యంగా కాపురం పెట్టిన‌ట్లు అప్ప‌టి మీడియా కోడై కూసింది. ఇరువురు అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు లీక‌వ్వ‌డంతో మందాకిని సినిమాల ప‌ట్ల ఆశ్ర‌ద్ధ చూపిస్తున్నార‌ని వెలుగులోకి వ‌చ్చింది. అలా మందాకిని బాలీవుడ్ కెరీర్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 57 ఏళ్లు. అయితే ఇప్పుడామె బాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు బాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మంచి స్క్రిప్ట్ దొరికితే మందాకిని కంబ్యాక్ అవ్వ‌డానికి రెడీ గా ఉన్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఆర్ధికంగాను బాగా స్థిర‌ప‌డ‌టంతో ఆమె స్వీయ నిర్మాణం చేప‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

డాన్ దావూద్ చ‌రిత్ర అసాధార‌ణ‌మైన‌ది. ముంబై న‌లు దిశ‌లా పోలీస్ వ్య‌వ‌స్థ క‌ట్టుదిట్టంగా ఉన్నా దావూద్ ఆగ‌డాల‌ను అరిక‌ట్ట‌డంలో విఫ‌ల‌మైన స్టోరీతో ప‌లు సినిమాల్ని వెండితెర‌కు ఎక్కించిన సంగ‌తి తెలిసిందే. ముంబైలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ డోంగ్రీ ఏరియా నుంచి పాకిస్తాన్ కరాచీ వ‌ర‌కూ గ‌ల్ఫ్ లో సువిశాల సామ్రాజ్యాన్ని విస్త‌రించ‌డం వ‌ర‌కూ అతడి క‌థ‌ అసాధార‌ణ‌మైన‌ది.

అత‌డికి భార్య ఉన్నా సినీక‌థానాయిక‌ల‌తో ఎఫైర్లు సాగించి సినీసామ్రాజ్యంలో బిగ్ షాట్స్ ని బెదిరించి డ‌బ్బు వ‌సూలు చేసేవాడ‌న్న క‌థ‌నాలు నాడు సంచ‌ల‌నం అయ్యాయి. అత‌డి చుట్టూ క‌థ‌లు అల్ల‌డం ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు ప‌రిపాటిగా మారింది. ఇక దావూద్ స్ఫూర్తితో సినిమాలు తెర‌కెక్కించిన తెలుగు ద‌ర్శ‌కుడు ఆర్జీవీ పేరు అప్ప‌ట్లో మార్మోగింది.