Begin typing your search above and press return to search.

రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత మందాకిని రీఎంట్రీ

By:  Tupaki Desk   |   28 April 2022 4:30 AM
రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత మందాకిని రీఎంట్రీ
X
వ‌హ‌వా నీ య‌వ్వ‌నం.. వ‌హ‌వా నీ య‌వ్వ‌నం.. వ‌హ‌వా నీ రాజ‌సం..! సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన క్లాసిక్ మూవీ 'సింహాస‌నం' నుంచి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ఇది. ఈ పాట విజువ‌ల్స్ లో ఒక అంద‌మైన ముఖం అభిమానుల్ని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తుంది. వ‌హ‌వా నీ పౌరుషం .. వ‌హ‌వా నీ రాజ‌సం ! అంటూ క్లాసిక్ సాంగ్ లో మందాకిని ఇచ్చే ఎక్స్ ప్రెష‌న్స్ ని కృష్ణ అభిమానులు ఇప్ప‌టికీ మ‌రువ‌లేరు. ఆ సినిమాతో మందాకినికి తెలుగు జ‌నంలో ఫాలోయింగ్ అసాధార‌ణంగా పెరిగింది. గాజు క‌ళ్ల‌తో క్యూట్ అప్పియ‌రెన్స్ తో మాయ చేసే అందం మందాకిని సొంతం.

అప్ప‌టికే మందాకిని హిందీ చిత్ర‌సీమ‌లో పెద్ద స్టార్ గా ఎదుగుతోంది. రామ్ తేరి గంగా మైలీ స్టార్ గా మందాకినికి గొప్ప గుర్తింపు ఉంది. చాలా కాలం స్టార్ గా కొన‌సాగిన మందాకిని ఆ త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. ప్ర‌స్తుతం 20 సంవత్సరాల తర్వాత తిరిగి ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించేందుకు సిద్ధ‌మైంది.

అయితే ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడు ఆఫర్లను ఎందుకు వ‌దులుకుందో కూడా తాజా చాట్ సెష‌న్ లో వెల్లడించింది. 1985లో విడుదలైన రామ్ తేరి గంగా మైలీ చిత్రంలో గంగా సింగ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మందాకిని రీఎంట్రీకి సిద్ధంగా ఉంది. 1996లో షోబిజ్ ను విడిచిపెట్టింది మందాకిని. త్వరలో 'మా ఓ మా' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించనుంది. మందాకిని కుమారుడు రబ్బిల్ ఠాకూర్ కూడా ఆ వీడియోలో కనిపించడం మరింత ప్రత్యేకం. సజన్ అగర్వాల్ దర్శకత్వం వహించిన ఈ పాట షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభమవుతుంది.

ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మందాకిని పునరాగమనంపై స్వ‌యంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తన పునరాగమనం గురించి మీడియాతో మాట్లాడారు. "పాట చాలా బాగుంది. నేను అవును అని చెప్పవలసి వచ్చింది. నో చెప్పడానికి కారణం లేకపోలేదు. చాలా బ్యూటిఫుల్ అండ్ స్వీట్ సాంగ్ ఇది'' అంటూ రిలీజ్ కి రెడీ అవుతున్న పాటను మెచ్చుకుంది. మందాకిని 20 ఏళ్లుగా షోబిజ్‌కు దూరంగా ఉంది. 'మా ఓ మా'తో కమ్‌బ్యాక్ ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు "నాకు ఆఫర్లు వస్తున్నాయి కానీ నాకు ఏమీ నచ్చలేదు కాబట్టి నేను అవును అని చెప్పలేదు. ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. నేను అతనికి చాలా సంవత్సరాలుగా తెలుసు.. మేము కుటుంబ స‌భ్యుల్లా క‌లిసి ఉన్నాం.. అని వెల్ల‌డించారు.

మందాకిని చాలా తరచుగా తల్లి పాత్రను పోషించింది. ఆమె పునరాగమన ప్రాజెక్ట్ లో మరోసారి తల్లిగా చూస్తాము. తెరపై తల్లిగా నటించే ఈక్వేషన్ గురించి అడిగినప్పుడు.. ''ఇది ఉత్తమ అనుభూతి.. మాతృత్వం తాలూకా అనుభూతి అని నేను భావిస్తున్నాను. తల్లి తన బిడ్డతో పంచుకునే సంబంధం స్వచ్ఛమైనది. ఇదే ఉత్తమమైన సంబంధం'' అని మందాకిని చెప్పింది.

తన తల్లితో కలిసి తెరంగేట్రం చేయనున్న వారసుడు రబ్బిల్ మాట్లాడుతూ..తాను చిన్న‌ప్పుడు స‌రిగా సినిమాలు చూడ‌లేద‌ని తెలిపాడు. మందాకిని అతనిని అడ్డగిస్తూ.. "నేటి సినిమాలు చాలా అధునాతనమైనవి. కాబట్టి 20 ఏళ్ల క్రితం తీసిన సినిమాలు నేటి తరానికి నచ్చలేదు. స్పష్టంగా చెప్పాలంటే.. అవి పాతవి. మీరు మళ్లీ చూడగలిగే సినిమాలు చాలా తక్కువ. సాధారణంగా మనం ఆ చిత్రాలను చూసినప్పుడు కూడా మనకు వింతగా అనిపిస్తుంది.. ఎందుకంటే ఈ రోజు సినిమాలు తీసే విధానంలో మార్పులు ఉన్నాయి.

జోర్దార్ చిత్రంలో చివరిగా కనిపించిన మందాకిని డ్యాన్స్ డ్యాన్స్,.. లడాయి,.. కహాన్ హై కానూన్,.. నాగ్ నాగిన్,.. ప్యార్ కే నామ్ ఖుర్బాన్ .. ప్యార్ కర్కే దేఖో వంటి చిత్రాల్లోనూ ప్ర‌స్తుతం న‌టిస్తోంది.