Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: 'బేడీ'లు వేస్తోందంతే

By:  Tupaki Desk   |   1 Aug 2016 11:30 AM GMT
ఫోటో స్టోరి: బేడీలు వేస్తోందంతే
X
టెలివిజన్ యాక్టింగ్ నుంచి మొదలు పెట్టి.. క్రికెట్ వ్యాఖ్యాత వరకూ.. సినిమా యాక్టర్ నుంచి టీవీల్లో హోస్ట్-జడ్జ్ వరకు.. మందిరాబేడీ ట్యాలెంట్ రకరకాలుగా చూపించింది. వీటితో పాటు ఈమెకు ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్.. ఫిట్నెస్ ఫ్రీక్ కావడం.

ఇదుగో పైన చూపిస్తున్న ఫోటోలో మందిర బేడీ ఏ రేంజ్ లో ఉందో చూశారా? యాబ్స్ నుంచి అబ్డామెన్ వరకూ.. ఆమె ఫిట్నెస్ చూసి నోరెళ్లబెట్టాల్సిందే. మందిరకు 44 ఏళ్లు అని తెలిస్తే.. ఎవరికైనా సౌండాఫ్ అయిపోతుంది. ఆ ఫోటో చూపించి.. గతేడాది ఈ టైంకి ఇలా ఉన్నానంటోంది మందిరా బేడి. కాకపోతే తర్వాత కొంత ఫిట్నెస్ పోవడంతో ఫిజిక్ మారిపోయిందిట.

మళ్లీ కష్టపడి ఆ ఫిజిక్ మారిపోతున్నాననని.. మరి కొన్నివారాల్లో అలా మారిపోతున్నానని అంటోంది మందిరాబేడి. చూస్తుంటే.. ఈమె ఫిట్నెస్ సాధించేసి.. అటు తన ఫిజిక్ కి.. ఇటు తన ఏజ్ కి బేడీలు వేస్తున్నట్లుంది కదూ.