Begin typing your search above and press return to search.
‘మరిచిపోవటానికి జ్ఞాపకం కాదు.. మా జీవితం’ ట్వీట్ తో కన్నీళ్లు తెప్పించింది
By: Tupaki Desk | 16 Aug 2021 2:56 AM GMTప్రేమ’ చాలా సున్నితమైన భావోద్వేగం. వ్యక్తపర్చినప్పుడు అందరికి తెలుస్తుంది. మౌనంగా ఉండే మనసుకే పరిమితమవుతుంది. సినీ తారలు.. సెలబ్రిటీలు కూడా మనుషులే. మిగిలిన వారితో పోలిస్తే వారిలో అమితమైన ఎమోషన్స్ ఉంటాయి. వారు తమ దగ్గరి వారి వద్ద అసలైన వ్యక్తులుగా వ్యవహరిస్తుంటారు. నిజానికి గ్లామర్ రంగం చాలా మాయగా ఉంటుందని.. అందులో ఉండే వ్యక్తుల మాటలు మధురంగా.. చేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయన్న ఆరోపణ ఉంది. తరచి చూస్తే.. ఎప్పటికప్పుడు కొత్తవారితో కలిసి పని చేసే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఉండలేరు కదా.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. చూసేందుకు ప్రాక్టికల్ మనుషులుగా కనిపించే వారిలో భావోద్వేగం ఏ స్థాయిలో ఉంటుందో అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. తాజాగా అలాంటిదే నటి కమ్ సెలబ్రిటీ మందిరాబేడీలోనూ స్పష్టంగా కనిపించింది. దాదాపు నెలన్నర క్రితం (జూన్ 30న) ఆమె భర్త కమ్ సినీ దర్శకుడు రాజ్ కౌశల్ మరణించటం తెలిసిందే. అప్పటివరకు బాగానే ఉన్నఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావటం.. ఆసుపత్రికి తీసుకెళ్లినంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం అందరిని షాక్ కు గురి చేసింది.
ఇక.. మందిరా ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రాశ్చత్య మహిళగా కనిపించే ఆమెలో భావోద్వేగం ఎంతన్న విషయం ఆమెను చూసిన వారందరికి అర్థమైంది. ఆగస్టు 15 రాజ్ కౌశల్ పుట్టిన రోజు. ఇంతకాలం కలిసి ఆనందంగా.. పండుగలా చేసుకున్న బర్త్ డేలకు ఈసారి అందుకు భిన్నంగా నిరాశ అనే చీకటిలో కూరుకుపోయిన వైనం.. భర్త మీద తనకున్న బోలెడంత ప్రేమను మాటల రూపంలో.. ఒక ట్వీట్ తో ఆమె షేర్ చేసుకున్నారు. ఈ ట్వీట్ చదివిన వారంతా ఎమోషనల్ అయ్యేలా ఉంది.
‘‘ఆగస్టు 15 ఎల్లప్పుడూ వేడుకగా ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్ర్య దినోత్సవం, రాజ్ పుట్టిరోజు. హ్యాపీ బర్త్డే రాజీ.. మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీవు మమ్మల్ని చూస్తున్నావని ఆశిస్తున్నా. నీవు లేని ఈ శూన్యత ఎన్నటికీ పూరించలేం. నీవు మరచిపోవడానికి జ్ఞాపకం కాదు.. మా జీవితం ’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఇది చదివిన ఆమె అభిమానులే కాదు.. మిగిలిన వారంతా మందిరా పడుతున్న వేదన ఎంతన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. కొంతకాలం క్రితం నటి సుమలత భర్త అంబరీష్ మరణించిన వేళలో.. ఆయన్నుసాగనంపే క్షణంలో ఆమె స్పందించిన తీరును గుర్తు చేసుకున్న వారి కళ్లల్లో ఇప్పటికి కన్నీటి చెమ్మ ఇట్టే రాక మానదు. తాజాగా మందిర ట్వీట్ మళ్లీ అలాంటి పనే చేస్తున్నారని చెప్పక తప్పదు.