Begin typing your search above and press return to search.

ఆంటీ గారు ఎందుకీ పాట్లు త‌ల‌కిందులుగా?

By:  Tupaki Desk   |   2 April 2020 5:03 AM GMT
ఆంటీ గారు ఎందుకీ పాట్లు త‌ల‌కిందులుగా?
X
సెల‌బ్రిటీల‌కు లాక్ డౌన్ అంత‌గా క‌లిసొచ్చిందా? ఇంటి ప‌ట్టునే ఉంటూ మిరియాల క‌షాయం తాగుతూ క‌రోనాపై యుద్ధం ప్ర‌క‌టించారు మ‌రి. ప‌నిలో ప‌నిగా ఒళ్లంతా హూనం అయిపోయేలా ఇంట్లోనే జిమ్ములు చేస్తున్నారు. భారీగా కండ‌లు పెంచే ప‌ని పెట్టుకున్నారు. కొంద‌రు ఒంటిపై ఉన్న న‌రాల్ని పొంగిస్తున్నారు. ఇక జీరోసైజ్ భామ‌లు మ‌రింత‌గా ట్రిమ్ అయిపోతూ బాడీని కంట్రోల్ లో ఉంచుతున్నారు.

క‌రీనా.. కత్రిన‌.. పూజా.. జాన్వీ.. శాన్వి.. అహ‌నా .. కారేరీ క‌స‌ర‌త్తుల క‌న‌ర్హం అన్న చందంగా ఎవ‌రికి వారు ఇండ్ల‌లోనే జిమ్ చేస్తూ యోగాస‌నాలు వేస్తూ ఆ ఫోటోల్ని అంత‌ర్జాలంలో వైర‌ల్ చేస్తున్నారు. ఇదిగో అదే బాట‌లో సాహో నారీమ‌ణి మందిరా భేడీ కూడా వెళుతోంది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో యోగాస‌నాలు వేస్తూ మందిర ఇచ్చిన ట్రీట్ ప్ర‌స్తుతం అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది.

సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఎంతో యాక్టివ్ గా ఉండే మందిర లుక్ ప్ర‌స్తుతం యువ‌త‌రంలో స్ఫూర్తి నింపుతోంది. 40 ప్ల‌స్ ఏజ్ లోనూ ఆంటీగారు మ‌రీ ఇంత ట్రిమ్ లుక్ ఎలా మెయింటెయిన్ చేస్తున్నారో అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారంతా. ఇక మందిర బాడీ షేప‌ప్ అయిన తీరు చూస్తే.. కండ‌లు మెలితిరిగిన హాలీవుడ్ లేడీ విల‌న్ల‌కు ఏమాత్రం తీసిపోదు క‌దా! అంటూ యూత్ కామెంట్ల‌తోనూ విరుచుకుప‌డుతున్నారు. ఇక ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రంలో మందిర రోల్ గురించి తెలిసిందే. ఎవ‌రా సీక్రెట్ లేడీ బాస్? అంటూ యూత్ ముక్కున వేలేసుకున్నారు. ఇక మందిర నిరంత‌రం బికినీ.. టూపీస్ ఫోటోల‌తో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ సంగ‌తి చూస్తే... ప్ర‌స్తుతం జీవీ ప్ర‌కాష్‌- సుర‌భి జంట‌గా న‌టిస్తున్న అడంగ‌తే అనే త‌మిళ చిత్రంలో మందిరా భేడీ ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తోంది. ఎంటీవీ నుంచి 2017లోనే క్విట్ అయిపోయిన మందిర బుల్లితెర కార్య‌క్ర‌మాల్లో అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తూ ట్రీటిస్తూనే ఉంది.