Begin typing your search above and press return to search.

అశ్రున‌య‌నాల‌తో రాజ్ కౌశ‌ల్ కు వీడ్కోలు.. భ‌ర్త‌కు మందిరా బేడీ త‌ల‌కొరివి

By:  Tupaki Desk   |   30 Jun 2021 4:32 PM GMT
అశ్రున‌య‌నాల‌తో రాజ్ కౌశ‌ల్ కు వీడ్కోలు.. భ‌ర్త‌కు మందిరా బేడీ త‌ల‌కొరివి
X
బాలీవుడ్ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ రాజ్ కౌశ‌ల్ ఇవాళ (జూన్ 30) తెల్ల‌వారుజామున‌ గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. రాజ్ మృతివార్త తెలుసుకున్న ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఆయ‌న నివాసానికి చేరుకొని నివాళుల‌ర్పించారు. ఉద‌య‌మే నిర్వ‌హించిన‌ అంత్య‌క్రియ‌ల్లో.. ఆయ‌న‌ భార్య‌, ప్ర‌ముఖ న‌టి మందిరా బేడీ స్వ‌యంగా త‌ల‌కొరివి పెట్టారు.

రాజ్ అంతిమ సంస్కారాల్లో బాలీవుడ్ సెల‌బ్రిటీలు అపూర్వ అగ్నిహోత్రి, హ్యుమా ఖురేషి, స‌మీర్ సోని, గుల్ ప‌నాగ్, రోహిత్ రాయ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. భ‌ర్త మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న మందిరా బేడీని బాలీవుడ్ హీరోయిన్లు ఓదార్చేందుకు ప్ర‌య‌త్నించారు. వీరిలో.. లారా ద‌త్తా, దివ్యా ద‌త్తా, నేహా దూపియా త‌దిత‌రులు ఉన్నారు.

బాంద్రాలోని శ్మ‌శాన వాటిక‌లో జ‌రిగిన అంతిమ సంస్కారాల్లో.. మందిరాబేడీ స్వ‌యంగా భ‌ర్త చితికి నిప్పంటించారు. త‌న‌ను వ‌దిలిపోతున్న భ‌ర్త‌ను త‌లుచుకొని చివ‌రి నిమిషంలో.. గుండెలు అవిసేలా రోధించారు మందిరా. ఆ స‌మ‌యంలో ఆమెను ఓదార్చ‌డం ఎవ‌రిత‌ర‌మూ కాలేదు.

రాజ్ కౌశ‌ల్ - మందిరా బేడీది ప్రేమ వివాహం. చాలా కాలం ప్రేమ‌లో ఉన్న త‌ర్వాత 1999లో వీరు పెళ్లి ద్వారా ఒక్క‌ట‌య్యారు. వీరి వివాహం అయిన ప‌న్నెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒక బాబు జ‌న్మించాడు. గ‌తేడాది మ‌రో పాప‌ను దత్త‌త తీసుకున్నారు.