Begin typing your search above and press return to search.

ఏజ్ తో సంబంధం లేదు..ఫిట్ నెస్ ఉంటే చాలు!

By:  Tupaki Desk   |   12 May 2022 1:30 AM GMT
ఏజ్ తో సంబంధం లేదు..ఫిట్ నెస్ ఉంటే చాలు!
X
మతులు పోగొట్టడానికి వయసుతో సంబంధం లేదు అనేలా ఉంటాయి కొందరు ఇచ్చే ఫోజులు. పైన మీరు చూస్తున్న ఫోటోకి ఈ ఉపమానం అచ్చంగా సరిపోతుంది. 90 పీరియడ్ లో క్రికెట్ మ్యాచులు - దూరదర్శన్ టీవీ చూసే వాళ్ళకు బాగా సుపరిచితురాలైన మందిరా బేడి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రభాస్ సాహో సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన మందిరా బేడి 50 ఏళ్ళ తన వయసును ఏ మాత్రం లెక్క చేయకుండా స్టిల్స్ ఇస్తూ అందరి దృష్టిని తన వైపు కు తిప్పుకునేలా మైంటైన్ చేస్తూ ఉంటుంది. క్లీవేజ్ ని స్పష్టంగా కనిపించేలా టాప్ యాంగిల్ లో దించేయ‌గ‌ల‌దు. అవ‌స‌ర‌మైతే బికినీలు వేసేయ‌గ‌ల‌దు. అవును ఇప్పుడు 50 ఏళ్ల‌ మందిరా బేడి టూపీస్ బికినీ ధ‌రించి మంట‌లు రేపుతుంది.

రెడ్ క‌ల‌ర్ టూపీస్ లో క‌ళ్ల‌కి స‌న్ గ్లాసెస్ ధ‌రించి బీచ్ లో ఇలా టాప్ యాంగిల్ లో కెమెరాకి ఫోజులిచ్చింది. మందిరా బేడిని ఇలా చూస్తే మ‌తి పోవాల్సిందే. గ్లామర్ విషయంలో తగ్గేదేలే అనే సందేశాన్ని పాస్ చేసింది మ‌రోసారి. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టా లో కాక‌లు పుట్టిస్తుంది. 50 బేడీపై 25 ఏళ్ల హీరోయిన్ ఫీల‌వుతూ కామెంట్లు పెడుతున్నారు.

50 వయసు దాటాక కూడా మందిరా ఇలా రెచ్చిపోయి ఫోజులు ఇవ్వడం వెనుక ప్రత్యేక కారణం అంటూ ఏమి లేదు. కెరీర్ మొదట్లో `శాంతి` సీరియల్ లో డీసెంట్ రోల్ పోషించి అశేష అభిమానులు సంపాదించుకున్న మందిరా క్రికెట్ యాంకర్ గా మారిన తర్వాత పొట్టిగా జుత్తు కత్తిరించుకుని అప్పటి నుంచి తన స్టైల్ అండ్ లుక్ పూర్తిగా మార్చేసుకుంది.

మూడు పదులు దాటగానే ఎక్స్ పైరి డేట్ అయిపోయినట్టు చూసే గ్లామర్ ప్రపంచంలో మందిరా లా మొహమాటపడకుండా ఉంటేనే అవకాశాలకు గేలం వెయ్యగలం. ఈ సూత్రాన్ని వంట ప‌ట్టించుకుంది కాబట్టే రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఫాంని కంటున్యూ చేయ గ‌ల్గుతుంది.

`సాహో` త‌ర్వాత రెండు త‌మిళ్ సినిమాలు చేసింది. కానీ అవి రిలీజ్ కాలేదు. ఈ క్ర‌మంలో వెబ్ సిరీస్ ల‌తో బిజీ అయింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆరేడు వెబ్ సిరీస్ ల్లో న‌టించింది. గ‌తే డాది `సిక్స్` అనే సిరీస్ తో ఆక‌ట్టుకుంది.