Begin typing your search above and press return to search.

సాహో బ్యూటీ హోలీ స్పెషల్ గ్లామర్ ట్రీట్..!

By:  Tupaki Desk   |   29 March 2021 11:30 AM GMT
సాహో బ్యూటీ హోలీ స్పెషల్ గ్లామర్ ట్రీట్..!
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో వయసు పైబడిన హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పటికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటారు. సినిమాలపరంగా స్లో అయినా తమ గ్లామర్ షో ద్వారా హైలైట్ అవుతుంటారు. అలాంటి వారిలో ఓ స్టార్ బ్యూటీ కూడా ఉంది. ఆమెనే సాహో ఫేమ్ మందిరాబేడి. నిజానికి సౌత్ ఇండియా జనాలకు మందిరా పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె కెరీర్ పరంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ టీవీ యాంకర్ గా, బాలీవుడ్ సినీనటిగా అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కానీ సౌత్ ఇండియా వైపు ఆమెను ఒకప్పుడు హీరో శింబు సరసన ఓ తమిళ సినిమాలో మెరిసింది. ఇక మళ్లీ సౌత్ సినిమాల్లో కనిపించలేదు. పూర్తిగా బాలీవుడ్ వైపు మళ్ళింది.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ షో కంపల్సరీ అనేది త్వరగా గ్రహించింది బేడి. అందుకే అన్నేళ్లు ప్రేక్షకులకు ఫేవరేట్ గా నిలిచింది. అయితే సినిమాలతో, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాను ఎలా హీటెక్కించాలో మందిరాకు బాగా తెలుసు. అందుకే ఏమాత్రం సంకోచించకుండా అందాల ఆరబోత చేసేస్తుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో మందిరా అందాలకు మిలియన్ పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ నలభై ఎనిమిదేళ్ల సుందరి.. ఇప్పటికి టు-పీస్ బికినీ వేసి కుర్రకారులో సెగలు రేపుతోంది. తాజాగా మందిరా ఇంస్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. హోలీ పండగ సందర్బంగా పోస్ట్ చేసిన ఆ వీడియోలో కూడా మందిరా అందాలవిందు తప్పలేదు. ఓవైపు ఓల్డ్ హిట్ సాంగ్ ప్లే చేసి.. మరోవైపు ఆమె స్లో మోషన్ లో పైన క్లాత్ తొలగించి పక్కన పడేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.