Begin typing your search above and press return to search.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చివరి నిమిషంలో!?
By: Tupaki Desk | 28 March 2019 1:39 PM GMTభన్సాలీ పద్మావత్ సినిమాకి ఎన్ని చిక్కులు వచ్చి పడ్డాయో ఆర్జీవీ సినిమాకి అన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి. చివరి నిమిషం వరకూ ఈ సినిమా రిలీజవుతుందా? అవ్వదా? అన్న డైలెమా కొనసాగుతోంది. మార్చి 29 ముహూర్తం అంటూ ఆర్జీవీ చెప్పినప్పటి నుంచి అసలు ఈ సినిమా రిలీజ్ ని ఎలా ఆపాలి? అన్న పంతం ప్రత్యర్థి వర్గంలో కనిపిస్తూనే ఉంది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ ని ఆపాల్సిందేనంటూ తేదేపా వర్గాలు .. నాయకులు చాలా పెద్ద ఎత్తున దండయాత్ర చేపడుతున్నారు. ఎన్నికల ముందు బయోపిక్ లు రిలీజ్ చేయకూడదన్న క్లాజ్ ని ఉపయోగిస్తున్నారు.
తాజాగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా విడుదలపై మంగళగిరి కోర్ట్ ఇంజన్షన్ గ్రాంట్ చేయడం సంచలనమైంది. 15 ఏప్రిల్ 2019 వరకు సినిమా హాళ్లలో ప్రదర్శన - సోషల్ మీడియా ప్లాటు ఫార్మ్స్ యూట్యూబ్ - ట్విట్టర్ - ఫేస్ బుక్ - ఇన్ స్టాగ్రామ్ తదితర మీడియా లలో ఎక్కడా ప్రదర్శించకూడదని ఇంజన్షన్ తేవడం చర్చనీయాంశమైంది. రాంగోపాల్ వర్మ రాకేష్ రెడ్డి - అగస్త్య మంజు తదితరులకు ఆ మేరకు కోర్ట్ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రచారం సాగుతోంది.
కారణం ఏదైనా చివరి నిమిషంలో ఈ ఝలక్ ఊహించనిది. ఇది కుటుంబ కుట్రల చిత్రం! అని ఆర్జీవీ ఎంత నిజాయితీగా తీసే ప్రయత్న ం చేస్తే అంతే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ కోర్టు ఉత్తర్వులు అన్న మాట వినిపించగానే ఇటు ఫిలింక్రిటిక్స్ లోనూ ఆసక్తికర డిబేట్ చోటు చేసుకుంది. `అన్ అవాయిడబుల్ సర్కమస్టెన్సెస్` వల్లనే లక్ష్మీస్ ఎన్టీఆర్ మీడియా ప్రీమియర్ షోని నిలిపేస్తున్నామని అధికారికంగా మీడియాకు సమాచారం పంపించారు. ప్రెస్ షో వివరాల్ని తదుపరి వెల్లడిస్తామని తెలిపారు. దీంతో ఇక ఈ సినిమా రిలీజ్ అధికారికంగా వాయిదా పడిందని అర్థమవుతోంది.