Begin typing your search above and press return to search.

2.0 నిర్మాత‌పై బ‌యోపిక్ తీస్తున్నారా?

By:  Tupaki Desk   |   8 Dec 2019 10:52 AM IST
2.0 నిర్మాత‌పై బ‌యోపిక్ తీస్తున్నారా?
X
ద‌క్షిణాది ఉత్త‌రాది అనే తేడా లేకుండా అన్ని భాష‌ల్లో బ‌యోపిక్ ల హంగామానే క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు లివింగ్ లెజెండ్స్ క‌థ‌ల్ని.. విధి చేతిలో ఓడిపోయి గెలిచిన పోరాట యోధుల క‌థ‌ల్ని తెర‌పైకి తీసుకొచ్చారు. అందులో క్రికెట‌ర్లు.. క్రీడాకారుల జీవిత క‌థ‌ల్ని విరివిగా తెర‌పైకి తీసుకొచ్చారు. ఆ త‌రువాత వివిధ రంగాల్లో పేరు తెచ్చుకుని ప‌లువురికి ఆద‌ర్శంగా నిలిచిన వారి క‌థ‌ల్ని చూపించారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖుల క‌థ‌ల్ని తెర‌పైకి తీసుకొచ్చారు.

ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి.. ద‌క్షిణాదిలోనే తొలిసారి వంద‌ల కోట్ల‌తో సినిమాలు నిర్మించిన ఓ బ‌డా నిర్మాత జీవిత క‌థ‌ని తెరపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఆ నిర్మాత మ‌రెవ‌రో కాదు `2.ఓ` చిత్రాన్ని 540 కోట్ల భారీ వ్య‌యంతో నిర్మించి భార‌త‌దేశ‌ సినీచ‌రిత్ర‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన అల్లి రాజా సుభాస్క‌ర‌న్‌. సామాన్యుడిగా మొద‌లైన ఆయ‌న ప్ర‌యాణం వేల కోట్ల వ్యాపార‌ సామ్రాజ్యంగా మారింది. అది ద‌శ‌ దిశ‌లా విస్త‌రించింది. లైకా మొబైల్స్ ఇప్పుడు 23 దేశాల్లో విస్త‌రించి ఉన్నాయి. శ్రీ‌లంక నుంచి లండ‌న్ వెళ్లిన ఆయ‌న విజ‌య ప్ర‌స్థానాన్ని తీసుకుని జీవిత క‌థ‌గా తెర‌పైకి తీసుకురావాల‌ని ఇద్ద‌రు ద‌ర్శ‌కులు పోటీప‌డుతున్నారు.

సామాజిక అంశాల్ని అండ‌ర్ క‌రెంట్ గా చ‌ర్చిస్తూ వెండితెర‌పై అత్యుత్త‌మ చిత్రాల్ని అందిస్తున్న ద‌ర్శ‌కులు మ‌ణిర‌త్నం.. ఏ.ఆర్‌.మురుగాదాస్‌. ఈ ఇద్ద‌రు అల్లిరాజా సుభాస్క‌ర‌న్ బ‌యోపిక్ కోసం పోటీప‌డుతున్నారు. ఇటీవ‌ల మ‌లేషియా ప్ర‌భుత్వం అల్లిరాజా సుభాస్క‌ర‌న్ గౌర‌వ డాక్ట‌రేట్ తో స‌త్క‌రించింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌ణిర‌త్నం.. మురుగ‌దాస్ బ‌యోపిక్ చేయాల‌న్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు. అయితే తొలి భాగాన్ని మ‌ణిర‌త్నం చేస్తే.. సీక్వెల్ ని తాను చేస్తాన‌ని మురుగ‌దాస్ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.