Begin typing your search above and press return to search.
మణి సర్ బిడ్డను ఆయనకు అప్పజెప్పారు సరే!
By: Tupaki Desk | 20 Aug 2022 1:35 PM GMTసౌతిండస్ట్రీలో నాలుగు దశాబ్ధాలుగా అలుపెరగక సినీపరిశ్రమకు సేవలందించారు మణిరత్నం. కెరీర్ లో ఎన్నో క్లాసిక్స్ ని తెరకెక్కించి ప్రజల మన్ననలు అందుకున్నారు. 40 ఏళ్ల కెరీర్‌లో భారతీయ ప్రేక్షకులకు కొన్ని మరపురాని చిత్రాలను అందించారు. అతను ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
ఇంకో 40 రోజులే రిలీజ్ కి డెడ్ లైన్. దీంతో మణిరత్నం అలెర్టయ్యారు. తన సినిమాకి బజ్ తెచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ముందుగా తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్టయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో మేకర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలకు ధన్యవాదాలు తెలిపారు.
చిరంజీవి - రాజమౌళి -తనికెళ్ల భరణి వంటి ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ- ``చిరంజీవిగారికి కృతజ్ఞతలు చెప్పాలి. దాని వెనుక కారణం నేను చెప్పను. అది ఏమిటనేది అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే రాజమౌళికి కృతజ్ఞతలు. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా తీయగలమనే నమ్మకాన్ని ఆయన మాకు అందించారు. నా సినిమా బాధ్యతను దిల్ రాజు గారికి అప్పగిస్తున్నాను. నా బిడ్డను తెలుగులో ఆయనే చూసుకోవాలి. బేషరతుగా మద్దతు ఇచ్చిన తనికెళ్ల భరణికి కూడా కృతజ్ఞతలు`` అన్నారు.
ఐదేళ్ల ఎదురు చూపులు ఫలిస్తాయా?
మణిరత్నం ఐదేళ్లుగా దృష్టిసారించి పని చేస్తున్న `పొన్నియిన్ సెల్వన్` కరోనా క్రైసిస్ వల్ల అంతకంతకు ఆలస్యమైంది. పెండింగ్ పనుల్ని పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా బాహుబలి తరహాలోనే రెండు భాగాలుగా రూపొందుతోంది. భారీ యాక్షన్ .. అసాధారణ పాత్రలు.. ఎమోషన్స్.. విజవల్ గ్రాఫిక్స్ తో వెటరన్ దర్శకుడు భారీ కాన్వాస్ పై తెరకెక్కిస్తున్నారు.
పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ పీరియడ్ ఎపిక్ లో కార్తీ- విక్రమ్- జయం రవి వంటి పలువురు తమిళ స్టార్ లు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మాజీ విశ్వసుందరి .. మణిరత్నం శిష్యురాలు ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తోంది. ఇది తమిళ చిత్రసీమలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లలో ఒకటిగా నిలుస్తోంది. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఇక పొన్నియన్ సెల్వన్ ని బాహుబలి తరహాలోనే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న మణిరత్నం తనకు దారి చూపినందుకు టాలీవుడ్ లెజెండ్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు ఆయనపై తన నమ్మకాన్ని ఉంచారు. మణి సర్ బిడ్డను ఆయనకు అప్పజెప్పారు సరే! ఆశించినది దక్కుతుందా లేదా? అన్నది ఇప్పటికి సస్పెన్స్.