Begin typing your search above and press return to search.
మణిరత్నం మళ్లీ ఆ రూట్ పట్టేశారా?
By: Tupaki Desk | 14 Nov 2016 11:30 AM GMTదిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం రెట్టించిన వేగంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ట్రెండీ లవ్ స్టోరీలు తీస్తూ ఆడియన్స్ కు కనువిందు చేస్తున్నారు. అయితే.. ఈయనకు మాత్రం పొలిటికల్ స్టోరీస్ అంటే మహా ఇష్టం. వరుసగా సినిమాలన్నీ నిరుత్సాహపరచడంతో కొన్నేళ్లు వీటికి బ్రేక్ ఇచ్చారు కానీ.. ఇప్పుడు మళ్లీ అదే రూట్ లోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు మణిరత్నం సొంత బ్యానర్ అయిన మద్రాస్ టాకీస్ పేరు మీద.. 'అథిర్ కచ్చి' అనే టైటిల్ రిజిస్టర్ చేశారు. దీని అర్ధం ప్రతిపక్షం అనే. ఈ ఒక్క టైటిల్ తోనే ఇది పొలిటికల్ యాంగిల్ తో తీయనున్న సినిమా అనే విషయం అర్ధమైపోతోంది. హృదయం ఫేమ్ మురళి కొడుకు అథర్వ మురళి హీరోగా నటించనున్నాడు. అయితే.. రోజా ముంబై లాంటి సినిమాలు తప్ప.. ఆ తర్వాత మణి సార్ కి ఈ పొలిటికల్ జోనర్ అంతగా కలిసి రాలేదు. ఇద్దరు.. దిల్ సే.. అమృత వంటి సినిమాలన్నీ డింకీ కొట్టేశాయి.
మణిరత్నం కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ అన్నీ పొలిటికల్ మూవీసే. ఆయనకు స్ట్రాంగ్ జోనర్ అదే అయినా.. అక్కడే దెబ్బతింటూ ఉంటారు. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షం అంటూ పొలిటికల్ సబ్జెక్ట్ నే టచ్ చేయనున్న మణిరత్నం.. ఈసారి ఎలాంటి రిజల్ట్ ఫేస్ చేస్తారో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/