Begin typing your search above and press return to search.
నానిని వదలనంటున్న మణి
By: Tupaki Desk | 21 Jan 2019 11:55 AM GMTమణిరత్నం పేరు తెలియని సినిమా ప్రేమికుడు ఉంటాడా. అలాగే ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకొని హీరో కానీ నటులు కూడా ఉండరు. దర్శకులకు స్టార్ స్టేటస్ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ లో ఈయన పేరు చాలా ప్రత్యేకం. అయితే గత కొన్నేళ్లుగా మణిరత్నం ఆయన స్థాయి సక్సెస్ ని సాధించలేకపోతున్నారు. ఇటీవలే వచ్చిన నవాబ్ తమిళ్ లో ఓ మాదిరిగా ఆడింది కానీ మనవాళ్లకు అసలు నచ్చకపోవడంతో డిజాస్టర్ తప్పలేదు. అయితే వెనుకటి సినిమాల కంటే బెటర్ అనిపించుకోవడం అభిమానులకు ఊరట కలిగించింది.
మణిరత్నం ఇప్పుడు కొత్త సినిమా సన్నాహాల్లో ఉన్నారు. కల్కి పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా రూపొందించనున్న ఈ మూవీ కోసం ఇప్పటికే విక్రమ్-జయం రవి-విజయ్ సేతుపతిలతో పాటు బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ లను లాక్ చేసుకున్నాడని చెన్నై టాక్. అయితే ఇందులో మరో కీలక పాత్ర కోసం నానిని గట్టిగా ట్రై చేస్తున్నట్టు తెలిసింది.
నవాబ్ లో అరుణ్ విజయ్ చేసిన పాత్రకు నానిని శింబు చేసిన రోల్ కు రామ్ చరణ్ ను అనుకున్న మణిరత్నం ఫైనల్ నేరేషన్ లో ఇద్దరినీ ఒప్పించలేకపోయారు. జరిగింది మంచికే అన్నట్టు ఫలితం వచ్చాక అర్థమయ్యింది. అయితే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పొన్నియన్ సెల్వన్ లో నానికి చాలా స్పాన్ ఉన్న పాత్ర ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే కమిట్ అయినవాటితో బిజీగా ఉన్న నాని దీనికి ఒప్పుకోవడం అంత ఈజీ కాదు. మణిరత్నం సినిమా అంటే కాదు అనే పరిస్థితి ఉండదు కానీ ఈ ప్రయత్నాలు ఎంత వరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాలి