Begin typing your search above and press return to search.

సౌత్ సినిమా విమ‌ర్శ‌పై నోళ్లు మూయించిన మ‌ణిర‌త్నం!

By:  Tupaki Desk   |   26 April 2022 8:36 AM GMT
సౌత్ సినిమా విమ‌ర్శ‌పై నోళ్లు మూయించిన మ‌ణిర‌త్నం!
X
సౌత్ సినిమాల స‌క్సెస్ పై కొంద‌రు బాలీవుడ్ ఉద్దండులు ఏ రేంజ్ లో అసూయ ప‌డుతున్నారో తెలిసిందే. న‌వాజుద్దీన్ సి్దిఖీ లాంటి వారు సౌత్ సినిమాపై గుప్పించిన సెటెర్లు ఏ రేంజ్ లో వైర‌ల్ అయ్యాయో తెలిసిందే. అలాగే బాలీవుడ్ క్రిటిక్స్ సైతం సౌత్ సినిమా విజ‌యాల్ని కించ‌ప‌ర‌చాల‌ని ప్ర‌య‌త్నించగా..వాళ్ల‌కి నెట్టింట నెటి జ‌నులు ఏ రేంజ్ లో కౌంట‌ర్ ఇచ్చారో కూడా తెలిసిందే.

బాలీవుడ్ ని మించిన గొప్ప సినిమాలు చేసే ద‌మ్ము సౌత్ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉంద‌ని గ‌ట్టిగానే చెప్పారు. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్'..'కేజీఎఫ్‌'..'పుష్ప' లాంటి స‌క్సెస్ ల్ని ఉద‌హరించి..హిందీ బెల్ట్ లో ఈ సినిమాలు సాధించిన వ‌సూళ్ల‌ను గుర్తు చేసారు. దీంతో ఎగ‌సెగ‌సి ప‌డిన నోళ్లు ఒక్క‌సారిగా మూత‌ప‌డ్డాయి. కౌంట‌ర్లు మానేసి కాకా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.

తాజాగా సౌత్ సినిమా గురించి.. అందులోనూ క‌న్న‌డ‌..తెలుగు సినిమాల గురించి లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. సౌత్ సినిమా గొప్ప‌ద‌నాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. "హాలీవుడ్ సినిమాలు త‌మిళ్ లో మంచి విజ‌యం సాధిస్తున్నారు. అలాంట‌ప్పుడు క‌న్న‌డ‌..తెలుగు సినిమాలు మ‌న ద‌గ్గ‌ర విజ‌యం సాధిస్తే త‌ప్పేముంది? అంటూ'' చుర‌క‌లు వేసారు.

"ద‌క్షిణాది సినిమాల ఫ‌రిది ఇప్పుడు పెరిగింది. ఇత‌ర భాష‌ల సినిమాల్ని చూసి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. త‌మిళ ప‌రిశ్ర‌మ ఎప్పుడూ ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కి పోటీగాఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పోటీ అనేది ఆరోగ్య‌క‌రంగా ఉండాలి. తెలుగు..క‌న్న‌డ భాష‌ల విజ‌యాల్ని ఎవ‌రూ ఆప‌లేరు. కొత్త మేక‌ర్స్ తెర‌పై వండ‌ర్స్ సృష్టిస్తున్నారు.

అలాంటి వాళ్ల‌ని ప్రోత్స‌హించాలి. మ‌రిన్ని వండ‌ర్స్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న వారు వ‌స్తున్నారు. సాంకేతిక‌త‌ను బాగా అందిపుచ్చుకుంటున్నారు. కొత్త కొత్త విష‌యాలు తెలుసుకుంటున్నారు' అని అన్నారు.

మ‌ణిర‌త్నం మాట‌లు బాలీవుడ్ స‌హా..కోలీవుడ్ పై సెటైరిక‌ల్ గా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. తెలుగు..క‌న్న‌డ సినిమాల్ని త‌మిళులు చిన్న చూపు చూస్తార‌నే భావ‌న చాలా కాలంగా ఉంది. భాషాప్ర‌యుక్త రాష్ర్టంగా ఏర్ప‌టైన ద‌గ్గ‌ర నుంచి తెలుగు సినిమా అంటే కొంద‌రు భూతంలా చూస్తారు. అక్క‌డ తెలుగు సినిమా వివ‌క్ష‌కి గుర‌వుతుంద‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ణిర‌త్నం కోలీవుడ్ పై ప‌రోక్షంగా పంచ్ లు వేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆ మ‌ధ్య సంగీత ద‌ర్శ‌కుడు ఏ. ఆర్ రెహ‌మాన్ ముందుల దుబాయ్ అభిమాని బాలీవుడ్ ని పొగుడుతుంటే ఎలా ఫీల‌య్యారు? అన్న అనుభూతిని మీడియా ముఖంగా పంచుకున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ సినిమా అన‌డానికి బ‌ధులుగా హిందీ సినిమా ఆన‌డం ఆయ‌న్ని ఎంత‌గానో బాధించింది. దీంతో మాతృభాష‌పై రెహ‌మాన్ మ‌మ‌కారాన్ని చాటుకున్నారు.