Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు మణి సర్ ముహూర్తం ఫిక్స్
By: Tupaki Desk | 10 Nov 2019 11:07 AM GMTతమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ సినిమా తీస్తున్నారు అంటే అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనను అభిమానిస్తారంతా. ఆయన ఈసారి ఎలాంటి కథను ఎంచుకోబోతున్నారు? నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరు? అన్నదానిపైనా ఆసక్తిగా ముచ్చటించుకుంటారు. అయితే గత నాలుగైదేళ్లుగా మణిరత్నం తన స్థాయికి తగ్గ సినిమాల్ని ఇవ్వలేకపోతున్నారన్న విమర్శ ఉంది. అయితే ఆ విమర్శలన్నిటీకీ సమాధానం చెప్పే పాన్ ఇండియా సినిమా కోసం గత రెండేళ్లుగా ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. చారిత్రక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. రాజ రాజ చోళ అనే చక్రవర్తి జీవితకథను సినిమాగా తీసే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే ఇందులో తమిళ్- తెలుగు అగ్ర కథానాయకుల్ని కలిపి పాన్ ఇండియా కేటగిరీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్నది ఆయన ప్లాన్. ఆ క్రమంలోనే ఓ పాత్ర కోసం మహేష్ .. రామ్ చరణ్.. ప్రభాస్ లాంటి స్టార్లను ఒప్పించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. మన స్టార్లు రకరకాల ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో మణి సర్ ప్రపోజల్ కి అంగీకరించలేదు. ఆ క్రమంలోనే విక్రమ్- కార్తి, జయం రవి- కీర్తి సురేష్ లను కీలక పాత్రలకు ఎంపిక చేసుకున్నారు. ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందన్న ముచ్చటా సాగింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేయబోతోంది. పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ చివరి దశకు చేరుకున్నాయి.
ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్న తారలంతా ఇప్పటికే తమ పాత్రలకు సంబంధించిన వేషధారణ కోసం సిద్ధమవుతున్నారు. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రాన్ని ఒకేసారి నాలుగు భాషల్లో నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. మద్రాస్ టాకీస్ బ్యానర్- లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 12న థాయ్ ల్యాండ్ లో ఈ సినిమాని ప్రారంభిస్తున్నారు. అయితే ఇలాంటి భారీ చిత్రంలో నటించేందుకు మన స్టార్లు ఎందుకు అంగీకరించలేదు.. వీళ్లలో ఉన్న సంశయమేమిటో అంటూ ఆసక్తికర చాలా కాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.