Begin typing your search above and press return to search.
బ్యాంకాక్ అడ్డాగా మణిరత్నం మల్టీస్టారర్
By: Tupaki Desk | 15 Dec 2019 4:50 AM GMTస్టార్ డైరెక్టర్ మణిరత్నం రెండు.. మూడేళ్లగా పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఓ భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. విక్రమ్- కార్తీ- జయంరవి- విక్రంప్రభు-రహమాన్- ఐశ్వర్యారాయ్- ఐశ్వర్యాలక్ష్మి- శరత్‌కుమార్- ప్రభు- జయరామ్- అశ్విన్- కిశోర్ లను ప్రధాన పాత్రలకు ఎంపిక చేసారు. స్క్రిప్టు సహా స్టార్లు సిద్దంగా ఉన్నా! ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. భారీ బడ్జెట్ తో ప్రయోగం కావడం.. పైగా మణిరత్నం వైఫల్యాల కారణంగా ఈ మల్టీస్టారర్ ని నిర్మించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి కదిలొచ్చింది.
లైకా ప్రొడక్షన్స్ తో మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ యాడైంది. ఇన్నాళ్ల సస్పెన్స్ అనంతరం ఎట్టకేలకు ఈ సినిమా బ్యాంకాక్ లో షూటింగ్ ప్రారంభమైనట్లు వెలుగులోకి వచ్చింది. తొలి షెడ్యూల్ మొత్తం అక్కడే షూటింగ్ జరగనుందట. అనంతరం అక్కడ నుంచి ఇతర దేశాల్లో మరికొన్ని షెడ్యూల్స్ పూర్తిచేయనున్నారు. దీన్ని బట్టి ఈ మెగా మల్టీస్టారర్ మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం విదేశాల్లోనే పూర్తి చేసుకోనుందని తెలుస్తోంది. సాధారణంగా మణిరత్నం సినిమాలన్నీ చెన్నై స్టూడియోల్లోనే షూటింగ్ పూర్తిచేసుకునేలా ఉంటాయి. ఆయన కథలు చాలా అరుదుగా మాత్రమే ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్తుంటాయి.
కానీ ఈసారి మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి పొన్నియిన్ సెల్వన్ మొత్తం విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుతున్నారు. అలాగే ఈ సినిమా కోసం మణిరత్నం అదనంగా కొంత మంది రచయితలో కలిసి పనిచేసారు. స్క్రీన్ ప్లే కోసం కుమార్ వేల్ సహాయం తీసుకున్నారు. కథనం అందించడంలో కుమార్ వేల్ కీలక పాత్ర పోషించారుట. ఇక జయమోహన్ సంభాషణలు అందించగా.. రవి వర్మన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.