Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో మణిరత్నం ‘పీఎస్-1’.. కార్తీ - త్రిష లపై సాంగ్ షూట్..!
By: Tupaki Desk | 7 Aug 2021 6:59 AM GMTలెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ''పొన్నియన్ సెల్వన్''. చోళుల కాలం నాటి కథాంశంతో తీస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ చిత్రంలో విక్రమ్ - కార్తీ - జయం రవి - విక్రమ్ ప్రభు.. ఐశ్వర్యారాయ్ - త్రిష - శోభితా ధూళిపాళ్ల - ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
'పొన్నియన్ సెల్వన్' సినిమా షూటింగ్ మెజారిటీ భాగం చెన్నై - హైదరాబాద్ - రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పుదుచ్చేరిలో కీలకమైన షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు తిరిగి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. గ్రేప్ గార్డెన్ రోడ్ లో కార్తి - త్రిష - శోభిత దూళిపాళ్ల పాల్గొనే ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను రెండు వందలమంది డ్యాన్సర్లపై తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పబడుతున్న 'పొన్నియన్ సెల్వన్' ఫస్ట్ పార్ట్ ని ''పీఎస్ 1'' పేరుతో వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ‘పీఎస్-1’ లోగో పోస్టర్ ఆకట్టుకుంది. లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. సుభాస్కరన్ - మణిరత్నం ఈ విజువల్ వండర్ కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జయ మోహన్ మాటలు రాస్తున్నారు.
'నవాబ్' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మణిరత్నం రూపొందిస్తున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. మరోవైపు 'నవరస' అనే ఆంతాలజీ సిరీస్ ను రూపొందించారు లెజండరీ దర్శకుడు. మనిషి జీవితంలోని తొమ్మిది భావోద్వేగాలుగా చెప్పబడే నవరసాలను తొమ్మిది కథలుగా ఈ సిరీస్ లో చూపించారు. తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కించిన ఈ సిరీస్ లో భారీ తారాగణం నటించారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నిన్న శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 'నవరస' సిరీస్ మంచి స్పందన తెచ్చుకుంటోంది. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడానికి ఈ సిరీస్ ని రూపొందించారు.