Begin typing your search above and press return to search.

మజిలీలో మణిరత్నం స్టాంప్

By:  Tupaki Desk   |   11 March 2019 8:00 PM IST
మజిలీలో మణిరత్నం స్టాంప్
X
అక్కినేని నాగ చైతన్య సమంతా కాంబోలో మనం తరువాత వస్తున్న మజిలీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 5 విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికి టీజర్ ఒక ఆడియో సింగల్ ని రిలీజ్ చేశారు. మెల్లగా ప్రమోషన్ వేగాన్ని పెంచే పనిలో పడింది టీమ్. నిన్ను కోరితో నానికో మంచి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వం వహించడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో మణిరత్నం స్టాంప్ ఉంటుందట. అదెలాగో చూద్దాం.

సుమారు 30 ఏళ్ళ క్రితం మోహన్ రేవతి కార్తీక్ ల కాంబినేషన్ లో మౌనరాగం వచ్చింది. మోహన్ ని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న రేవతి మానసిక సంఘర్షణ చుట్టే సినిమా మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో చనిపోయిన కార్తీక్ తో ప్రేమ వల్లే తను అలా ఉందని గుర్తించిన మోహన్ తొందరపడకుండా తన మనసును గెలుచుకునే ప్రయత్నం చేయడమే మౌన రాగం

ఇక్కడ మజిలీలో అచ్చంగా ఇదే తరహా కాదు కానీ మెయిన్ థీమ్ మాత్రం ఇలాగే ఉంటుంది. కాకపోతే పాత్రలు మారాయి అంతే. ఇందుల చైతు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడు. తనే సమంతా. ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకే సమంతాను దగ్గరికి తీసుకోడు. ఒకప్పటి క్లాస్ మేట్ అయిన భర్త అలా చేయడం నరకంగా అనిపించినా తనను దగ్గర చేసుకునే ప్రయత్నాలే మజిలీ అని సమాచారం. మౌనరాగంకు ఇళయరాజా సంగీతం పెద్ద ప్లస్ అయ్యింది. ఇప్పుడు దీనికి గోపి సుందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. మరి మణిరత్నం స్టాంప్ ఉంటుందని చెప్పబడుతున్న మజిలీ అప్పటి మేజిక్ ని రిపీట్ చేస్తుందా వేచి చూడాలి