Begin typing your search above and press return to search.
మణిరత్నం సినిమా వచ్చేస్తోంది
By: Tupaki Desk | 12 Aug 2018 1:30 AM GMTఒక దర్శకుడిపై ప్రేక్షకులకు గురి కుదిరిందంటే.. అతడి ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా ప్రతి సినిమానూ ఆసక్తిగా చూస్తారు. ఆ దర్శకుడి కొత్త సినిమా రిలీజవుతోందంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతారు. రామ్ గోపాల్ వర్మలా పూర్తిగా ట్రాక్ తప్పిపోతే తప్ప.. ఒక స్థాయి ఉన్న దర్శకుల మీద ప్రేక్షకులకు అభిమానం అంత సులువుగా చావదు. దక్షిణాది ప్రేక్షకుల్లో ఇలా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. లక్షల మంది వీరాభిమానుల్ని సంపాదించుకున్న దర్శకుల్లో మణిరత్నం ఒకడు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. ఆయనలో ఉత్సాహం తగ్గలేదు. కొన్నేళ్ల కిందట ‘ఓకే బంగారం’ లాంటి ట్రెండీ మూవీ తీసి ఆశ్చర్యపరిచారు. ఆయన నుంచి చివరగా వచ్చిన ‘చెలియా’ ఫ్లాప్ అయినప్పటికీ అది కూడా దర్శకుడిగా ఆయన స్థాయిని తెలియజేసేదే.
ఈ సినమా తర్వాత మణి భారీ తారాగణంతో తమిళంలో ‘చెక్క చివంత వానం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు మణి. ఈ ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. సెప్టెంబరు 28నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిరత్నం సినిమా అంటే నెమ్మదిగా షూటింగ్ జరుపుకుని ఆలస్యంగా రిలీజవుతుంటుంది. కానీ ఈ భారీ మల్టీస్టారర్ ను మణి వేగంగానే పూర్తి చేసినట్లున్నారు. శింబు.. అరవింద్ స్వామి.. విజయ్ సేతుపతి.. జ్యోతిక.. అదితిరావు హైదరి.. ఇలా చాలా ఆకర్షణీయమైన తారాగణం ఇందులో ఉంది. మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమానే ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘2.0’ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’తో కలిసి మణిరత్నమే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.