Begin typing your search above and press return to search.
మణిశర్మ ... మళ్లీ లైన్లోకి వచ్చారే
By: Tupaki Desk | 12 July 2020 2:30 AM GMTతెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, ఒక్కడు, ఖుషి, పోకిరి.. ఇలా ఆయన ఖాతాలో ఎన్నో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లున్నాయి. ఒకప్పుడు తెలుగులో ఏ పెద్ద సినిమా తెరకెక్కుతున్నా మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకునేవాళ్లు. ఐతే ఎలాంటి మ్యుజీషియన్‌కు అయినా ఏదో ఒక దశలో ప్రభ తగ్గడం సహజం. మణిశర్మ విషయంలోనూ అదే జరిగింది. దేవిశ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్, తమన్ లాంటి వాళ్ల రాకతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. అలాగని ఆయనేమీ ఔట్ డేట్ అయిపోలేదు. మణిశర్మ సంగీతంలో పదును తగ్గిపోలేదు. ఐతే చాలా కాలం తర్వాత ఆయన ‘ఆచార్య’ రూపంలో ఓ పెద్ద సినిమాను దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది.
శనివారం మణిశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాకు తాను సంగీతం అందిస్తున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అందులో పాటలు, నేపథ్య సంగీతం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పారాయన. ఈ సినిమా కోసం ఇప్పటికే మూడు పాటల రికార్డింగ్ పూర్తియనట్లు మణిశర్మ వెల్లడించారు. మిగతా పాటలకు కూడా ట్యూన్లు, లిరిక్స్ కూడా సిద్ధమయ్యాయని.. రికార్డింగ్ మాత్రమే చేయాల్సి ఉందని, కరోనా వల్ల ఆ పని ఆగిపోయిందని ఆయన చెప్పారు. పదేళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు పని చేస్తున్నానని.. కథానుసారం కొన్ని పాటలు ఉంటూనే సినిమాలో ఒక ఐటెం సాంగ్, ఇద్దరు హీరోల మీద ఓ పాట, ఒక డ్యూయెట్ ఉంటాయని మణిశర్మ వెల్లడించారు. మెలోడీ, ఎమోషనల్ సాంగ్, డ్యాన్స్ నంబర్.. ఇలా అన్ని రకాల పాటలూ ఈ సినిమాలో ఉంటాయని.. అలాగే నేపథ్య సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉన్న చిత్రమిదని మణిశర్మ చెప్పారు.