Begin typing your search above and press return to search.
దేవదాస్ అలా ఓకే అయిందట!
By: Tupaki Desk | 29 Sep 2018 10:12 AM GMTఅక్కినేని నాగార్జున - నాని కలిసి నటించిన మల్టిస్టారర్ చిత్రం 'దేవదాస్' ఈనెల 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ - నాని ల కాంబినేషన్ సీన్స్ వర్క్ అవుట్ కావడంతో ప్రేక్షకులనుండి మంచి టాక్ దక్కించుకుంది. మొదటి రోజు వసూళ్ళు కూడా భారీగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది కానీ జస్ట్ రెండు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ఆదిత్యకు ఇలా ఇద్దరు స్టార్లు కలిసి నటించే భారీ స్కేల్ ఉన్న సినిమా అవకాశం ఎలా లభించింది?
ఈ సినిమా పట్టాలెక్కడంలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాత్ర చాలా ఉందట. శ్రీరామ్ ఆదిత్యకు ఈ సినిమా ఓకే అయ్యేవిషయంలో తనవంతు సహాయం చేసి హీరోలతో మీడియేషన్ చేశాడట. మణి శర్మ గతంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన 'శమంతకమణి' సినిమాకు సంగీతం అందించాడు. అప్పటినుండి శ్రీరామ్ తో క్లోజ్ అయ్యాడట. శ్రీరామ్ కు స్టార్ లను డీల్ చేసిన అనుభవం లేకపోయినా ఈ మల్టి స్టారర్ ను డీల్ చేయగలడని నాగార్జున - నాని లకు భరోసాకల్పించింది ఈ మెలోడి బ్రహ్మేనట.
ఈ సినిమా హిట్ రేంజ్ ని బట్టి శ్రీరామ్ కు ఫ్యూచర్ లో స్టార్ హీరోల ప్రాజెక్ట్ కు లు దక్కే అవకాశం ఉంది. ఏదేమైనా సీనియర్ అయిన మణి శర్మ ఇలా యువదర్శకుడికి సపోర్ట్ గా నిలవడం అభినందించదగిన విషయమే.