Begin typing your search above and press return to search.
ఏమిటి ఇప్పుడోళ్ల గొప్ప అంటున్న మణిశర్మ
By: Tupaki Desk | 14 Oct 2018 9:37 AM GMTతెలుగు సినిమా గర్వించ దగ్గ సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. 2000వ సంవత్సరానికి అటు ఇటుగా ఒక దశాబ్దం పాటు తిరుగులేని హవా సాగించారాయన. ఇటు మాస్ పాటలతో పాటు అటు అద్భుతమైన మెలోడీలతో మణిశర్మ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కానీ తర్వాత తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మధ్య అప్పుడప్పుడూ ఒక సినిమా చేస్తున్నారు తప్పితే.. బిజీగా అయితే లేరు. ఇప్పటి సంగీతం పోకడలే తనకు నచ్చట్లేదని ఆయన అంటున్నారు. విద్వత్తు చూడకుండా.. సంగీతం మీద సరైన అవగాహన లేని వాళ్లకు కూడా అవకాశాలిచ్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంగీతం అంటే చిన్న విషయం కాదని ఆయన అన్నారు.
ఇక పాటలకు.. ట్రైలర్లకు.. సినిమాలకు యూట్యూబ్ లో వచ్చే హిట్స్ ప్రామాణికం అయిపోయాయని.. వంద కోట్ల వసూళ్ల గురించి గొప్పలు పోతున్నారని.. ఇది సరైన పోకడ కాదని ఆయనన్నారు. తాను సంగీతం అందించిన ‘ఇంద్ర’.. ‘ఒక్కడు’.. ‘ఖుషి’ లాంటి సినిమాల ఆడియోలకు అప్పట్లో అద్భుతమైన ఆదరణ దక్కిందని.. వాటి విజయాల్ని ఎలా కొలుస్తారని మణిశర్మ ప్రశ్నించాడు. అప్పట్లోనే యూట్యూబ్ పాపులర్ అయి ఉంటే ఆ సినిమాల్లోని పాటలకు ఎన్ని కోట్ల హిట్స్ వచ్చేవో అంచనా వేయగలరా అని మణిశర్మ ప్రశ్నించాడు. అలాగే వంద కోట్ల కలెక్షన్ల గురించి గొప్పలు పోతున్నారని.. కానీ ఆ రోజుల్లో హిట్ల వసూళ్లను లెక్క కడితే ఇప్పుడు వేయి కోట్లకు సమానం అని మణిశర్మ అభిప్రాయపడ్డాడు. గాలి కాలుష్యం.. నీటి కాలుష్యం.. శబ్ద కాలుష్యం లాగే.. పాటలు కూడా ఈ రోజుల్లో కాలుష్యం అయిపోతున్నాయని.. శబ్దాల మాటున పాటలు నలిగిపోతున్నాయని మణిశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడేదో కొత్తగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవడం లేదని.. తన కెరీర్లో వెనుదిరిగి చూసుకుంటే మంచి పాటలు కొన్నయినా ఉన్నాయన్న సంతృప్తి చాలని ఆయన అన్నారు.