Begin typing your search above and press return to search.

'నారప్ప' నుంచి మెలోడి బ్రహ్మ తప్పుకున్నాడా..?

By:  Tupaki Desk   |   17 March 2021 6:30 AM GMT
నారప్ప నుంచి మెలోడి బ్రహ్మ తప్పుకున్నాడా..?
X
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''నారప్ప'' మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తమిళ క్లాసిక్ 'అసురన్' తెలుగు రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై డి.సురేష్ బాబు - కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మణిశర్మ తప్పుకున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇటీవల మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నారప్ప' చిత్రానికి తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ''నారప్ప కి నన్ను వర్క్ చేయనిస్తే బాగుండేది.. కానీ అది జరగడం లేదు.. ఆల్ రెడీ టీజర్ రిలీజ్ చేసి అందులో ఒరిజినల్ మ్యూజిక్ వేశారు.. అదో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. అందరూ నేను కాపీ కొట్టాను అన్నారు.. నా ప్రమేయం లేకుండానే అదంతా జరుగుతోంది'' అని మణిశర్మ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ వివాదం పెద్దదై మణిశర్మ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశారని.. మిగతా వర్క్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే 'నారప్ప' పోస్టర్ల మీద మణిశర్మ పేరు ఉండటం గమనార్హం. ఇటీవల విడుదలైన యంగ్ నారప్ప పోస్టర్ లో కూడా ఆయన పేరే ఉంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.