Begin typing your search above and press return to search.

మ‌ణి స‌ర్ రిప్ల‌య్ అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెట్టిందిగా!

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:00 AM GMT
మ‌ణి స‌ర్ రిప్ల‌య్ అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెట్టిందిగా!
X
ఈ శుక్రవారం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో ఒకటైన పొన్నియిన్ సెల్వన్ (పీఎస్-1) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం చిత్రబృందం సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఈ మూవీని చాలామంది అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ షో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌'తో పోల్చడం ప్రారంభించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తమిళ వెర్షన్ పొన్నియిన్ సెల్వన్ కాదా? అని మణిరత్నం ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు.

దానికి అత‌డి స‌మాధానం ఆస‌క్తిని క‌లిగించింది. పొన్నియిన్ సెల్వన్ ఇంగ్లీష్ వెర్షన్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అని డైరెక్టర్ మ‌ణి స‌ర్ తెలిపారు. మణిరత్నం నుండి వచ్చిన ఈ స్పందన చాలా మందిని కలవరపెడుతోంది. 1955లో కల్కి కృష్ణమూర్తి రాసిన అదే పేరుతో నవల ఆధారంగా పొన్నియన్ సెల్వన్ రూపొందించార‌ని ఇన్నాళ్లు విన్నాం. కానీ దానికి విరుద్ధ‌మైన జ‌వాబిచ్చారు మ‌ణి స‌ర్. ఈ భారీ బ‌డ్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాని లైకా ప్రొడక్షన్స్ - మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. అకాడమీ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సౌండ్ ట్రాక్స్ అందించారు.

'పొన్నియిన్ సెల్వన్' ఐదు భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది. ఇందులో విక్రమ్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ - జయం రవి- కార్తీ- త్రిష- ఐశ్వర్య లక్ష్మి- శోభితా ధూళిపాళ- ప్రభు- ఆర్. శరత్ కుమార్- విక్రమ్ ప్రభు- జయరామ్ప్ర- ప్ర‌కాష్ రాజ్- రెహమాన్- ఆర్. పార్తిబన్ వంటి తార‌లు న‌టిస్తున్నారు. విక్రమ్ ఆదిత్య కరికాలన్ టైటిల్ రోల్ లో కనిపించనుండగా.. నందినిగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించింది. వంతీయతేవన్ పాత్రలో కార్తీ- కుందవై పాత్రలో త్రిష- అరుణ్ మొళి వర్మన్ గా జయం రవి కనిపించనున్నారు.

10వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో ఆధిపత్య పోరును తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మిది. 1950ల నాటి 'కల్కి' అనే ఎవర్ గ్రీన్ తమిళ నవలకి సినిమాటిక్ అనుసరణ. ఇది కావేరీ నది కుమారుడైన పొన్నియిన్ సెల్వన్ భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తులలో ఒకరిగా మారడానికి ముందు క‌థ‌.. రాజరాజ చోళుడుగా పొన్నియ‌న్ గొప్ప‌ పిలుపును అందుకున్నారు. గొప్ప చ‌క్ర‌వ‌ర్తిగానూ పేరు తెచ్చుకున్నారు.

ఇది నిజానికి రియ‌ల్ స్టోరి. బ‌యోపిక్ కేట‌గిరీకి కూడా చెందుతుంది. కానీ మ‌ణిర‌త్నం అలా (గేమ్ ఆఫ్ థ్రోన్ పోలిక‌) ఎందుకు అన్నారు? ఊహాజ‌నిత‌మైన క‌థ‌తో సంబంధం లేని సినిమా క‌దా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

శ్రీ సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ -లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. రెండో భాగంపైనా మ‌ణిర‌త్నం వ‌ర్క్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.