Begin typing your search above and press return to search.

టీజ‌ర్‌ టాక్: క‌్వీన్ ఝాన్సీ వీర‌త్వం

By:  Tupaki Desk   |   2 Oct 2018 8:27 AM GMT
టీజ‌ర్‌ టాక్: క‌్వీన్ ఝాన్సీ వీర‌త్వం
X
2019 మోస్ట్ అవైటెడ్ రిలీజెస్ జాబితాలో కంగ‌న `మ‌ణిక‌ర్ణిక‌` పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బాహుబ‌లి - థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ జోన‌ర్‌ లోనే భారీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ - గ్రాఫిక్స్‌ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మ‌న తెలుగువాడైన క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో ఇటు టాలీవుడ్‌ లోనూ ఈ సినిమాపై ఉత్కంఠ నెల‌కొంది. స్వాతంత్య్ర స‌మ‌రంలో ఒక పురుషుడికి తీసిపోని రీతిలో అసాధార‌ణ‌మైన వీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ క్వీన్ ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ జీవిత‌క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నారు అన‌గానే అది జాతీయ స్థాయి ప్రాజెక్టుగా - ప్రాంతీయ భాష‌ల‌కు క‌నెక్ట‌య్యే ప్రాజెక్టుగానే పాపుల‌రైంది.

ఏడాదిగా ఈ సినిమా కోసం కంగ‌న ఎంత‌గా శ్ర‌మించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. అంత‌కుమించి క్రిష్ శ్ర‌మించారు. అయితే రిలీజ్ ముంగిట మ‌ణిక‌ర్ణిక టీమ్‌ లో అభిప్రాయ విభేధాలు - కంగ‌న‌- క్రిష్ మ‌ధ్య పొర‌పొచ్చాలు ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించాయి. అయినా మొక్క‌వోని ధీక్ష‌తో కంగ‌న బ్యాలెన్స్ ప‌నులు పూర్తి చేస్తోంది. తొంద‌ర్లోనే టీజ‌ర్‌ తో వ‌స్తున్నా అంటూ ప్ర‌క‌టించింది క్వీన్ కంగ‌న చెప్పిన‌ట్టే బ‌రిలో దిగింది. మ‌ణిక‌ర్ణిక టీజ‌ర్ అంత‌ర్జాలంలోకి ట్రిలియ‌న్ గిగాబైట్ స్పీడ్‌ తో దూసుకొచ్చింది.

ఒక అంద‌మైన లోకం.. ప్ర‌కృతి.. న‌దీ జలాల‌కు సంబంధించిన విజువ‌ల్‌ తో ఆరంభ‌మైన ఈ టీజ‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. రాజులు - రాణులు అంటేనే భారీ కోట‌లు - ప్రాకారాలు - సైన్యం - ప్ర‌జ‌లు య‌థావిధిగా క‌నిపించాయి. భార‌త‌ దేశంలో అడుగుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ జెండాని కోసుకుంటూ మ‌ణిక‌ర్ణిక అలియాస్ ఝాన్సీ రాణి ఎంట్రీ ఇచ్చిన తీరు వ్వాహ్ అనిపిస్తుంది. ఒక బిడ్డ‌కు త‌ల్లి అయిన ఝాన్సీ రాణి యుద్ధ రంగంలో శ‌త్రువుపై లంఘించేందుకు ఎలాంటి ఫీట్ వేసిందో చూసి తీరాల్సిందే అన్నంత ఉత్కంఠ‌గా టీజ‌ర్‌ ని తీర్చిదిద్దారు. ఆడ‌ది ఆది ప‌రాశ‌క్తి అయితే ఎలా ఉంటుందో.. క‌థ‌న‌రంగంలో క‌త్తి దూస్తే ఎలా ఉంటుందో ఈ టీజ‌ర్‌ లో వండ‌ర్‌ ఫుల్‌ గా చూపించారు. కంగ‌న శివంగి రూపం అందుకు పెద్ద ప్ల‌స్ అయ్యింద‌న‌డంలో సందేహ‌మే లేదు. ఇక‌పోతే బ్యాక్‌ గ్రౌండ్‌ లో బిగ్ బి అమితాబ్ వాయిస్ ఉత్కంఠ‌ను పెంచింది. సంగీతం ప‌రంగానూ నెక్ట్స్ లెవ‌ల్‌ లో ఉంద‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా కంగ‌న క‌త్తి తిప్పిన ప‌ద్ధ‌తి - శ‌త్రువులైన‌ ఆంగ్లేయుల్ని చీల్చి చెండాడిన విధానం ఆక‌ట్టుకుంది. పోస్ట‌ర్ల ద‌శ‌లోనే ఒళ్లంతా ర‌క్త‌పు మ‌ర‌క‌లు యుద్ధ స‌న్నాహ‌కాన్ని తెలిపాయి. టీజ‌ర్ ఫినిషింగ్‌ లో క్వీన్ ఝాన్సీ ఊచ‌కోత మిరాకిల్ అని చెప్పొచ్చు. శ్వేత వ‌ర్ణం గుర్రంపై కంగ‌న లంఘిస్తున్న తీరు - తుపాకి అందుకుని తూటాలు పేల్చుతున్న వైనం వ్వావ్‌! అన‌కుండా ఉండ‌లేం. కుత్త‌క తెగ కోయ‌డంలో క‌ర్క‌శ క్వీన్‌ లా క‌నిపించింది. హ‌ర హ‌ర మ‌హా దేవ్ అంటూ యుద్ధ రంగంలో విరుచుకుప‌డింది. అంతా బాగానే ఉంది కానీ, క్వీన్ ఝాన్సీ రాణి త‌న బిడ్డ స‌హా క‌థ‌న‌రంగంలో పోరాటం సాగించింద‌ని చిన్న‌ప్పుడు పాఠ్య పుస్త‌కాల్లో చ‌దువుకున్నాం. ఆ బిట్‌ ని చూపించ‌లేదెందుకో!! ఇక‌పోతే సింహాస‌నంపై బిడ్డను కూచోబెట్టి ఒక షాట్‌ ని చూపించారు. జీస్టూడియోస్‌- ఖైతాన్ జాయింట్ వెంచ‌ర్ ఇది. 2019 జ‌న‌వ‌రి 25న రిప‌బ్లిక్ డే కానుక‌గా ఈ చిత్రం రిలీజ‌వుతోంది.