Begin typing your search above and press return to search.

మణిరత్నం సినిమా తెలుగు టైటిల్ ఇదే..

By:  Tupaki Desk   |   12 Nov 2016 11:30 AM GMT
మణిరత్నం సినిమా తెలుగు టైటిల్ ఇదే..
X
మణిరత్నంకు తమిళంలో ఎంత మంది అభిమానులున్నారో.. తెలుగులోనూ ఆయనకు అంతే ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పట్నుంచో తమిళంతో పాటే తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలవుతూ వస్తున్నాయి. మధ్యలో కొన్నేళ్లు ఆయన జోరు తగ్గింది కానీ.. గత ఏడాది ఓకే కణ్మణి (ఓకే బంగారం)తో మళ్లీ జోరందుకున్నాడు మణి. ఈ సినిమా తర్వాత నాని హీరోగా ఒక సినిమా అనుకున్నాడు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కార్తి హీరోగా సినిమా మొదలుపెట్టాడు. అదే.. ‘కాట్రు వేళయిదే’. ఈ సినిమా కూడా తెలుగులో రిలీజ్ కాబోతోంది. తెలుగు టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ఈ సినిమా పేరు.. డ్యూయెట్.

90ల్లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్.. డ్యూయెట్. ఆ టైటిలే ఇప్పుడు మణి సినిమాకు వాడేస్తున్నారు. విశేషం ఏంటంటే.. మణిరత్నం లాస్ట్ మూవీ ‘ఓకే బంగారం’ను తెలుగులో అందించిన దిల్ రాజే ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ‘ఓకే బంగారం’ మంచి ఫలితాన్నివ్వడంతో రాజు.. మళ్లీ మణిరత్నం మీద నమ్మకం పెట్టాడు. తన గత సినిమాను రాజు ప్రమోట్ చేసి రిలీజ్ చేసిన తీరు నచ్చి మణిరత్నం రీజనబుల్ రేటుకే ఈ సినిమాను కూడా అమ్మాడట. ఈ చిత్రాన్ని తమిళంలో మణిరత్నమే నిర్మిస్తున్నాడు. కార్తి సరసన అదితి రావు హైదరి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/