Begin typing your search above and press return to search.
మణిరత్నం 'గీతాంజలి' వెనుక కథాకమామిషు!
By: Tupaki Desk | 4 Sep 2022 5:30 PM GMTగీతాంజలి .. నాగార్జున కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిన సినిమా. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యాలలో ఒకటి. అలాంటి ఈ సినిమా 1989 మే 19వ తేదీన విడుదలైంది. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో గిరిజ అనే కొత్త కథానాయిక పరిచయమైంది. సీఎల్ నరసా రెడ్డి నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. అసలైన ప్రేమకు అర్థం చెప్పిన సినిమా. యూత్ ను ఒక రేంజ్ లో ఊపేసిన సినిమా. అలాంటి ఈ సినిమాను కొనడానికి అప్పట్లో బయ్యర్లు భయపడ్డారట.
'మణిరత్నానికి మొదటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. తాను ఒక కథను తయారు చేసుకుని ఆ కథలోని పాత్రలను బట్టే ఆయన నటీనటులను ఎంచుకుంటూ ఉంటారు. అలా ఆయన ఈ కథకు .. ఇందులోని నాయకుడి పాత్రకి నాగార్జునను తీసుకున్నారు. ఇక ఫారిన్ నుంచి సెలవులకి ఇండియా వచ్చిన 'గిరిజ' అనుకోకుండా ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాను దాదాపు ఊటీ నేపథ్యంలో తెరకెక్కించారు. మరికొన్ని నెలలకి మించి తాము బ్రతకమని తెలిసిన ఇద్దరు ప్రేమికుల కథ ఇది. తనదైన స్టైల్లో మణిరత్నం ఈ సినిమాను రూపొందించారు.
ఈ సినిమాకి ముందు మణిరత్నానికి వరుస హిట్లు ఉన్నాయి. అయినా ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు వెనకడుగు వేశారు. హీరో .. హీరోయిన్ ఇద్దరూ చనిపోతారా? ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా? ఇలాంటి క్లైమాక్స్ ను అంగీకరిస్తారా? అని ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నిర్మాత సీఎల్ నరసారెడ్డి ఈ సినిమాను స్వయంగా విడుదల చేశారు. ఇప్పటిలా ఒక రోజులో .. ఒక షోతో సినిమా రిజల్టును తేల్చేసే రోజులు కావు అవి. అందువలన 3 వారాల పాటు థియేటర్లలోనే ఉంచి చూశారు. ఈ 3 వారాల్లో ఈ సినిమా ఎక్కడా ఎవరికీ కనెక్ట్ అవుతున్న దాఖలాలు కనిపించలేదు.
దాంతో మరో వారం వెయిట్ చేద్దామని నరసారెడ్డి భావించాడు. ఆయన ఆశించినట్టుగానే 4వ వారం నుంచి జనంలో కదలిక మొదలైంది. ఈ సినిమాను గురించి మాట్లాడుకోవటం .. థియేటర్ల బాటపట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ సినిమా టిక్కెట్లు దొరకడం కష్టమైపోయింది. ఈ సినిమాలోని ప్రతి పాట హిట్ ... ప్రతి దృశ్యం అద్భుతం అన్నారు. ఈ సినిమాకి ఇదే సరైన క్లైమాక్స్ అని ఒప్పుకున్నారు. మణిరత్నం సినిమాల్లో ఇది మణిపూస అన్నారు .. ఇళయరాజా చేసిన గొప్ప ఆల్బమ్స్ లో ఇది ఒకటి అని చెప్పుకున్నారు.
ఇలా చాలామంది అంచనాలను తలక్రిందులు చేసిన ఈ సినిమా, అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోని ఒక క్లాసిక్ గానే మిగిలిపోయింది. నాగార్జున కెరియర్ కి ఎంతో హెల్ప్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో గిరిజ ధరించిన డ్రెస్ లు పాప్యులర్ అయ్యాయి. 'గీతాంజలి డ్రెస్' లు పేరుతో మార్కెట్లోకి వచ్చాయి. సాధారణంగా హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయితే ఆ వెంటనే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతుంటారు. కానీ గిరిజ మాత్రం ఆ తరువాత సినిమాలపై పెద్దగా ఆసక్తిని చూపకుండా తిరిగి విదేశాలకి వెళ్లిపోయింది.