Begin typing your search above and press return to search.

మహేష్ ప్లేస్ దుల్కర్ కొట్టేశాడా?

By:  Tupaki Desk   |   16 July 2015 11:31 AM GMT
మహేష్ ప్లేస్ దుల్కర్ కొట్టేశాడా?
X
విలన్, కడలి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాక మణిరత్నం.. అక్కినేని నాగార్జున, మహేష్ బాబుల కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా తీయడానికి సన్నాహాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. స్వయంగా మణిరత్నం సతీమణి సుహాసినే ఈ ప్రాజెక్టు గురించి కన్ఫమ్ చేసింది కూడా. ఈ సినిమాలో రిస్క్ ఎక్కువుండటం వల్లో ఏమో.. దాన్ని సెట్స్ మీదికి తీసుకురాలేకపోయారు మణిరత్నం. తన పాత స్టయిల్లోకి వెళ్లిపోయి.. సఖి తరహాలో ‘ఓకే బంగారం’ లాంటి రొమాంటిక్ మూవీ తీశారు మణిరత్నం. ఆ సినిమా మణిరత్నంను మళ్లీ సక్సెస్ ట్రాక్ ‌లోకి తెచ్చింది. ఆ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో తాను పక్కనబెట్టేసిన రిస్కీ ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు మణిరత్నం.

ఐతే ఈసారి నాగ్, మహేష్‌లతో కాకుండా వేరే హీరోల్ని చూసుకున్నాడు. ఇప్పటికే కార్తి ఒక హీరోగా ఎంపికైన సంగతి తెలిసిందే. కార్తి ఇంతకుముందు మణిరత్నం దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ఇక రెండో హీరోగా ‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్‌నే ఎంచుకున్నట్లు సమాచారం. నాగ్ పాత్రను కార్తితో చేయిస్తూ.. మహేష్ క్యారెక్టర్‌కు దుల్కర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మణిరత్నం రెగ్యులర్ టెక్నీషియన్సే పని చేయబోతున్నారు. సొంత బేనర్ ‘మద్రాస్ టాకీస్’లోనే నిర్మించబోతున్నాడు మణి. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది.