Begin typing your search above and press return to search.

'న‌వాబ్' తో గులాంగిరీ సాగుతుందా?

By:  Tupaki Desk   |   17 Aug 2018 5:33 AM GMT
న‌వాబ్ తో గులాంగిరీ సాగుతుందా?
X

న‌వాబ్ సార్ గులాంగిరీ ఏంటో కానీ.. జ‌నం త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈసారి `న‌వాబ్` ఏం చేస్తాడోన‌న్న ఆలోచ‌న ఎవ‌రినీ నిలువ‌నివ్వ‌డం లేదు. వ‌రుసగా ఎన్ని ఫ్లాపులు తీసినా మ‌ణిరత్నంపై ఉన్న గురి అలాంటిది మ‌రి. ఆయ‌న ఓ సినిమాని నెత్తికెత్తుకున్నారు అంటే అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంటుంది. అప్పుడు ఫెయిలైనా ఈసారైనా ఇంకేందో మాయ చేస్తాడ‌నే ఎదురు చూస్తారు.. ప్ర‌స్తుతం ఆ మాయ కనిపిస్తోంది. పోస్ట‌ర్ల ముఖంగా జ‌నాల‌కు ఏదో తెలుస్తోంది. ఇంకేందో తొలిచేస్తోంది. తాజాగా రిలీజ్ చేసి `న‌వాబ్` పోస్ట‌ర్లు అంత‌కంత‌కు క్యూరియాసిటీ పెంచేస్తున్నాయ్‌.

అస‌లే మ‌ణిరత్నం.. అటుపై గ్రేట్ విజ‌న‌రీ డైరెక్ట‌ర్‌. టెక్నాల‌జీని పుక్కిట ప‌ట్టిన .. స్క్రీన్‌ ప్లే మేధోత‌నం తెలిసిన‌ రేర్ డైరెక్ట‌ర్ అత‌డు. అందుకే ఈసారి `న‌వాబ్` లాంటి మ‌ల్టీస్టార‌ర్‌ తో ఏం చేయ‌బోతున్నాడోన‌న్న ఆస‌క్తి అంత‌కంత‌కు రెయిజ్ అవుతోంది. అర‌వింద స్వామి గెట‌ప్ ఇప్ప‌టికే కేక పుట్టించింది. గుండుగీసి పైన మొలిచిన వెంట్రుక‌ల్ని నెల‌ల‌కొద్దీ గడుస్తున్నా అస‌లు దువ్వ‌కుండా వ‌దిలేస్తే ఎంత ర‌ఫ్‌ గా - ర‌గ్గుడ్‌ గా క‌నిపిస్తాడో అర‌వింద స్వామిని చూస్తే తెలుస్తోంది. శిలాంబ‌ర‌స‌న్ అలియాస్ శింబు గెట‌ప్‌ - విజ‌య్ సేతుప‌తి గెట‌ప్ ప్ర‌తిదీ ఉత్కంఠ పెంచేవే. ప్ర‌కాష్‌ రాజ్‌ - అరుణ్‌ విజ‌య్‌ - జ్యోతిక లాంటి స్టార్లు ఉన్నారు. ఇంత‌మంది గ్రేట్ స్టార్ల క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న భారీ మ‌ల్టీస్టార‌ర్‌ గా వేడి అంత‌కంత‌కు పెంచేస్తోంది.

అంతేకాదు.. నేడు శంక‌ర్ బ‌ర్త్‌ డే గురించి - 2.ఓ గురించి మ‌ర్చిపోయి మ‌రీ `న‌వాబ్` మోజులో ఉంది లైకా సంస్థ‌. ఆ సంగ‌తిని లైకా అధికారిక ట్విట్ట‌ర్ ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికైతే పోస్ట‌ర్లు భారీ అంచ‌నాలు పెంచాయి. దీంతో మ‌ణిర‌త్నం ఈజ్ బ్యాక్ .. అని ప్రూవ్ చేస్తారా? అన్న చ‌ర్చా సాగుతోంది. `ఓకే బంగారం` త‌ర్వాత మ‌ణి ర‌త్నం మ‌ళ్లీ ఫ్లాప్‌షో చూపించారు. అందుకే ఈసారి బ్లాక్‌ బ‌స్ట‌ర్ కొట్టాల్సిన స‌న్నివేశం ఉంది. పోస్ట‌ర్ల‌లో ఉన్నంత సినిమాలో ఉంటే చాలు.. హిట్టు కొట్టిన‌ట్టేన‌ని అభిమానులు భావిస్తున్నారు. చూద్దాం .. న‌వాబ్ సార్ గులాంగిరీ!!