Begin typing your search above and press return to search.
ఒక విలన్.. ఒక కడలి.. ఒక చెలియా!
By: Tupaki Desk | 8 April 2017 5:30 PM GMTమణిరత్నం స్థాయి ఏంటి.. ఆయన ఎంత గొప్ప సినిమాలు తీశాడన్న చర్చ ఇప్పుడు అవసరం లేదు. మణిరత్నం సినిమా చూడటం అన్నది మిగతా సినిమాలు చూడటం లాగా కాదు. అది ఒక ఎక్స్ పీరియన్స్. అది ఏళ్ల తరబడి మనతో కొనసాగుతుంది. ఆయన సినిమాల్ని ఒక్కసారి చూసి వదిలేయలేం. ఐదేళ్లకోసారి మళ్లీ చూసుకుంటే.. అప్పటి మన మెచ్యూరిటీ లెవెల్స్ లో అది కొత్తగా అనిపిస్తుంది. అందుకే మూడు దశాబ్దాల కిందట ఆయన తీసిన సినిమాలు కూడా ఇప్పుడు కొత్తగా అనిపిస్తాయి. మరోసారి చూసుకుంటే కొత్త అనుభూతిని పంచుతాయి. ఐతే మణి గత కొన్నేళ్లుగా తీసిన సినిమాల్లో ఆ ఫీలింగే మిస్సవుతోంది. ‘ఓకే బంగారం’ను పక్కన పెడితే.. విలన్.. కడలి.. ఇప్పుడు చెలియా సినిమాల్ని మళ్లీ మళ్లీ చూడటం పక్కనపెడితే.. ఒక్కసారి చూడటమే భారంగా అనిపించింది.
ఈ మూడు సినిమాల్ని పరిశీలిస్తే కామన్ కొన్ని అంశాలు కనిపిస్తాయి. వీటిలో సాంకేతిక ఆకర్షణలు సినిమాను మించిపోయాయి. ‘విలన్’లో సంతోష్ శివన్ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ విజువల్స్ చూసి ప్రేక్షకులకు మతిపోయింది. ‘కడలి’లోనూ అంతే. ఈ రెండు సినిమాలకు సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ‘చెలియా’లో రవివర్మన్ ఛాయాగ్రహణం.. రెహమాన్ నేపథ్య సంగీతం కూడా కూడా అంతే బాగా కుదిరాయి. కానీ ఈ సినిమాలో ఆత్మ అన్నదే లేకపోయింది. ఈ మూడు సినిమాల్లో మణిరత్నం ఎంచుకున్న కథలు తీసి పడేయదగ్గవేమీ కాదు. వాటిలో కంటెంట్ లేకపోలేదు. మణిరత్నం గొప్పగా ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అవి ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయాయి.
మణిరత్నం సినిమాల్లో సన్నివేశాలు.. డైలాగులు ఎప్పుడూ కొంచెం ఇంటలిజెంట్ గానే అనిపిస్తాయి. కానీ బేసిక్ ఎమోషన్ అన్నది అందరికీ కనెక్టవుతుంది. కాబట్టి డైలాగులు కొన్ని అర్థం కాకున్నా.. సన్నివేశాల్లోని ఆకర్షణ దాన్ని కప్పి పుచ్చేస్తుంది. కానీ ఈ మూడు సినిమాల్లో అదే లేకపోయింది. ‘చెలియా’ విషయానికే వస్తే.. హీరోయిన్ నుంచి విడిపోవడానికి ముందు హీరో వచ్చి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడతాడు. ఆ సీన్లో హీరోయిన్ తల్లిదండ్రులు అసలు నోరే తెరవరు. కానీ వాళ్లు మౌనంగా ఉంటూనే తనను ప్రశ్నలతో గుచ్చి గుచ్చి చంపేస్తున్నారంటూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు హీరో. అతనొక్కడే మాట్లాడుతూ.. పెద్ద రణరంగం జరిగిన భావన కలిగిస్తాడు. ఇది అన్నీ విడమరిచి చెప్పకపోయినా అర్థం చేసుకోగలిగే ప్రేక్షకులకు మాత్రమే అర్థమయ్యే సీన్. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం పెద్ద తలపోటు వ్యవహారంలా అనిపిస్తుంది. తెరమీద అసలేం జరుగుతుందో అర్థం కాదసలు. ఇందులోని డైలాగులు అసలేమాత్రం జనాలకు కనెక్టయ్యేలా లేవు. సినిమాలో వచ్చే చాలా సన్నివేశాల్లో ఇదే పరిస్థితి. మణిరత్నం ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఉండొచ్చు.. ఓ వర్గం ప్రేక్షకులకు ఆయన ఉద్దేశం అర్థమై ఉండొచ్చు. కానీ సగటు ప్రేక్షకుడి పరిస్థితేంటి? అందుకే వాళ్లు సినిమాతో కనెక్టవ్వలేదు. ‘చెలియా’ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందుకే టాక్ మరీ బ్యాడ్ గా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/