Begin typing your search above and press return to search.

రిలేషన్స్ లో రైట్-రాంగ్ ఉండవ్

By:  Tupaki Desk   |   31 March 2017 5:34 PM GMT
రిలేషన్స్ లో రైట్-రాంగ్ ఉండవ్
X
సాధారణంగా మణిరత్నం సినిమాలు అంటే ఇలా ఉంటాయని జనాలకు ఓ ఆలోచన ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చే టీజర్స్.. ట్రైలర్స్.. పోస్టర్లలో కూడా తన సినిమా ఏ కాన్సెప్ట్ లో ఉంటుందనే విషయాన్ని చెబుతుంటారు మణిరత్నం. ముఖ్యంగా అనుబంధం.. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను పక్కాగా చూపుతుంటారు.

ప్రస్తుతం చెలియా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయిన మణిరత్నం.. మూవీ గురించే కాకుండా.. తన మేకింగ్ ఆలోచనల గురించి కూడా ఆసక్తికరమైన సంగతులు చెబుతున్నారు. "అనుబంధం ఎంత స్ట్రాంగ్ ఉంటుంది.. దానిపై వారు నిలబడతారా లేదా అనేదే ప్రధానమైన విషయం. ఇప్పటివరకూ చూపించని కనిపించని కొత్తం అంశాన్ని చూపాలన్నది నా ఉద్దేశ్యం. వారిద్దరి మధ్య జరిగేది ఏది నిజమైతే అదే సినిమా అవుతుంది. గతంలో తీసిన ఓకే కణ్మణి అయినా.. ఇప్పుడు కాట్రు వెలియిదాయ్ అయినా.. లవ్ స్టోరీలో క్లాసికల్ డ్రామా చూపడంలో నిజాయితీ చూపాలని భావించాను" అంటున్నారు మణిరత్నం.

"ఇద్దరు వ్యక్తుల మధ్య అనేక వైరుధ్యాలు ఉంటాయి. ఇది ఓకే కణ్మణి లాగా ఇంటిమేట్ అంశానికి సంబంధించినది కాదు. ఇది చాలా విస్తృతమైన కాన్సెప్ట్. ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పని చేసే కుర్రాడు.. ఓ డాక్టర్ యువతి మధ్య జరిగే జీవితం. వారి బంధం ఎంత స్ట్రాంగ్ అనే విషయం చూపబోతున్నాం. అయితే అనుబంధాల్లో తప్పు ఒప్పు అనేవి ఉండవు" అంటూ చూచాయగా సినిమా గురించి చెప్పారు దిగ్గజ దర్శకుడు మణిరత్నం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/