Begin typing your search above and press return to search.
ఆ అరవ సినిమాని తెగ ఆడేస్తున్న తెలుగు నెటిజన్స్
By: Tupaki Desk | 18 Sep 2022 6:41 AM GMTతమిళ్ లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన పొన్నియన్ సెల్వన్ మొదటి పార్ట్ విడుదలకు సిద్ధం అయ్యింది. మరికొన్ని రోజుల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా పై అంచనాలు తమిళనాట భారీ ఎత్తున ఉన్నాయి. తెలుగు లో ఈ సినిమాకు క్రేజ్ ను పెంచేందుకు మేకర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
తమిళ బాహుబలి అంటూ ఈ సినిమాను అక్కడి మీడియా తెగ ప్రమోట్ చేస్తుంది. వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం అన్నట్లుగా అక్కడి మీడియా హైప్ క్రియేట్ చేస్తోంది. కానీ తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఇప్పటి వరకు ఆ సినిమా ఒక రెగ్యులర్ డబ్బింగ్ సినిమా అనే అభిప్రాయం ఉంది. అంతకు మించి అనే అభిప్రాయం విడుదల సయమంకు కల్పించేందుకు యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సమయంలోనే సినిమా నుండి ఒక పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తమిళనాట పాటకు మంచి స్పందన దక్కింది. తెలుగు లో మాత్రం ఈ పాటను ట్రోల్స్ చేస్తున్నారు. తమిళంలో ఉన్న లిరిక్స్ ని ఉన్నది ఉన్నట్లుగా యాస ప్రాసలతో డబ్బింగ్ చేసినట్లుగా తెలుగు పాట లిరిక్స్ ఉన్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆ పాటకు తెలుగు వర్షన్ కోసం అనంత శ్రీరామ్ లిరిక్స్ ను అందించాడు. ఈ మధ్య కాలంలో ఈయన పద ప్రయోగాలు వివాదాస్పదం అవుతున్నాయి.. ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు మంచి పాటల రచయిత అంటూ పేరు దక్కించుకున్న అనంత శ్రీరామ్ ట్రోల్స్ ఎదుర్కోవడానికి కారణం ఆయన తెలుగు భాషను ఖూనీ చేస్తున్నాడు అంటున్నారు.
పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాలోని తాజా పాటకు అనంత శ్రీరామ్ ఇచ్చిన లిరిక్స్ మరియు ఆయన వాడిన పదాలు కాస్త ఎబెట్టుగా ఉన్నాయి. ఆయన ఇలా భాష ను భష్ఠు పట్టించడం ఏమాత్రం బాగాలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు బజ్ క్రియేట్ కాలేదని ఆందోళన చెందుతున్న యూనిట్ సభ్యులు ఇలాంటి ట్రోల్స్ తో మరింతగా సమస్యలు తప్పవని భావిస్తున్నారట.